- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతదే బాగుండె.. వైర్డ్ హెడ్‌ఫోన్లపై యువతలో పెరుగుతున్న ఆసక్తి!
ఇటీవల యువతలో తిరిగి వైర్డ్ ఇయర్‌ఫోన్లను ఉపయోగించాలన్న ఆస్తి పెరుగుతోంది.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మొబైల్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ ఏది కలిగి ఉన్నా చాలామంది వైర్డ్ హెడ్‌ఫోన్ ఉపయోగించేవారు. మ్యూజిక్ వినడానికి, వీడియోలు చూడటానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ ఆ తర్వాత వైర్‌లెస్ ఇయర్ బడ్స్, బ్లూటూత్‌లు మార్కెట్లోకి ప్రవేశించాయి. వైర్ ఉండదు. పైగా ఇతరులకు కనబడకుండా కూడా ఉపయోగించే సౌకర్యం ఉన్నందున చాలామంది వీటిని యూజ్ చేయడం మొదలు పెట్టడంతో మునుపటి వైర్డ్ హెడ్‌ఫోన్స్ అమ్మకాలు తగ్గాయి. అయితే ఇటీవల ఈ పరిస్థితి మళ్లీ రివర్స్ అవుతోందని, Gen Z, మిలీనియల్స్ ఇప్పుడు మళ్లీ వైర్డ్ హెడ్ ఫోన్లు (కేబుల్ ఉన్న హెడ్‌ఫోన్లు) ఉపయోగిండానికే మొగ్గు చూపుతున్నారని ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థ సర్వే పేర్కొన్నది. ఈ సాంకేతిక పునరావృతికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
Gen Z ఫ్యాషన్..
సిర్కానా (Circana) అనే మార్కె్ట్ రీసెర్చ్ ఫర్మ్ ప్రకారం.. ఇప్పుడు కేబుల్ లేదా వైర్ కలిగి ఉండే హెడ్‌ఫోన్‌ను యువత మళ్లీ ఇష్టపడుతోంది. దీంతో 2025లో దీని మార్కెట్ షేర్ 3% పెరిగింది. ఇక 2026 మొదటి వారాల్లో 20% వరకు రెవెన్యూ కూడా పెరిగింది. ఐదు సంవత్సరాల వరుస తగ్గుదల తర్వాత ఇది పెద్ద రివర్సల్‌గా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా Gen Z, మిలీనియల్స్ దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వైర్డ్ వైర్డ్ ఇయర్‌ఫోన్లు ఉపయోగించడం ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది.
కారణామిటి?
వైర్డ్ హెడ్‌ఫోన్లు, బ్లూటూత్, వైర్‌లెస్ మోడల్స్ కంటే ఎక్కువ ప్రయోజనాలు ఇవ్వడమే ఈ సాంకేతిక రివర్సల్‌గా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా అవి అన్‌కంప్రెస్డ్ ఆడియో (Lossless sound) అందిస్తాయి. ప్రత్యేకింగ్ ఏ లాగ్ ఉండదు (జీరో లేటెన్సీ), బ్యాటరీ చార్జింగ్ పెట్టాలనో, అయిపోయిందనో ఆందోళనే అవసరం లేదు. కాబట్టి కేబుల్ ఉండే హెడ్‌ఫోన్స్‌ను సౌకర్యవంతమైనవిగా తమ అనుభవాల ద్వారా యువత గ్రహించి, తిరిగి వాటిని ఉపయోగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మ్యూజిక్ లిజనింగ్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి పనుల్లో హై పెర్ఫార్మెన్స్ కావాల్సిన వారు కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరో విషయం ఏంటంటే.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లేదా బ్లూటూత్స్ కంటే కూడా వైర్డ్ హెడ్‌ఫోన్లు చాలా చౌకగా ఉంటాయి. రూ. 100 నుంచి రూ. 500లోపు ధరలో కూడా దొరుకుతాయి. పైగా మంచి సౌండ్ క్వాలిటీని సైతం ఇస్తాయి. అందుకే చాలా మంది తిరిగి వైర్డ్ హెడ్‌ఫోన్ల వైపు మళ్లుతున్నారు.
లయబుల్ టెక్నాలజీ వైపు..
వైర్డ్ హెడ్‌ఫోన్ ఉపయోగించాలన్న ఇటీవలి రీటర్న్ ఫ్యాషన్‌కు మరో చిన్న కారణం గత అనుభవాలు(Nostalgia), ధరల పెరుగుదల (Inflation) వంటివి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా చాలా మంది యువత “రివర్స్ అప్‌గ్రేడ్” చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్, రిలయబుల్ టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. అలాగనీ ఎవరూ వైర్‌లెస్ పరికరాలన్ని, ఇయర్‌ఫోన్లను, బ్లూటూత్‌లను వ్యతిరేకించడం లేదు. అవసరమైన వారు వీటిని కూడా వాడుతున్నారు. అయితే భవిష్యత్తులో మరింత విస్తృతంగా హెడ్‌ఫోన్ జాక్ తిరిగి రావడానికి కూడా ఇది దోహదపడవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సౌండ్ క్వాలిటీ, రిలయబిలిటీలో వైర్డ్ హెడ్‌ఫోన్లు బాగుంటాయి అనే అభిప్రాయంతో చాలామంది ఇప్పుడు వాటిని ఉపయోగించాలనే భావిస్తున్నారు.






