- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐని ఎలాగైనా దెబ్బతీయాలి.. Gen-Z ఆలోచన ఇదేనట!
జెన్-జెడ్ ఉద్యోగులు తాము పనిచేసే సంస్థల్లో ఏఐ యాక్టివిటీస్‌ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని ఒక సర్వే తెలిపింది. ట్రెండ్ విస్తరిస్తోందని పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో మానవులకు అనేక విషయాల్లో సౌకర్యం ఏర్పడుతోంది. వివిధ రంగాల్లో వినియోగంవల్ల శ్రమ, సమయం ఆదా అవుతోంది. ఏఐ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, యువతలో, ఉద్యోగుల్లో రక రకాల అనుమానాలు, సందేహాలు, భవిష్యత్ జాబ్ మార్కెట్‌పై ఆందోళనలు సైతం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ‘AI Adoption in the Enterprise 2026’ అనే సర్వే మరో ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అందేటో చూద్దామా!
29% మంది చేస్తున్నది ఇదే..
జెన్-జెడ్ ఉద్యోగులు తాము పనిచేసే సంస్థల్లో ఏఐ యాక్టివిటీస్‌ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని రైటర్ ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఏజెంట్ ప్లాట్‌ఫాం కంపెనీ (సాన్ ఫ్రాన్సిస్కో), అలాగే వర్క్‌ప్లేస్ ఇంటెలిజెన్స్ అనే స్వతంత్ర రీసెర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన కొత్త సర్వే తెలిపింది. ఈ ట్రెండ్ ఇటీవల బాగా విస్తరిస్తోందని పేర్కొన్నది. ఎందుకలా? యువత ఏఐని వ్యతిరేకించడమేంటి? అంటే.. జెన్‌జీ ఉద్యోగులు ఏఐవల్ల తమ ఉద్యోగాలకు పోతాయనే భయంతో ఇలా చేస్తున్నారు. ఎంటర్‌ప్రైజ్ ఏఐ ఏజెంట్ ఫర్మ్ రైటర్&రీసెర్చ్ ఫర్మ్ వర్క్‌ప్లేస్ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిన ఈ నివేదిక ప్రకారం.. అమెరికా, యూకే, యూరప్‌లలోని 2,400 మంది నాలెడ్జ్ వర్కర్ల(And 1,200 C-suite executives)ను ప్రశ్నించగా.. 29% ఉద్యోగులు తమ కంపెనీ ఏఐ వ్యూహాన్ని దెబ్బతీస్తున్నట్లు (Like sabotage) ఒప్పుకున్నారు.
కెరీర్‌కు ముప్పుగా భావించి..
జెన్- Z వర్కర్లలో 44% మంది ఏఐ వల్ల కెరీర్ రిస్క్‌లో పడుతుందని భావిస్తున్నారు. అందుకే వీరు తాము వర్క్ చేసే సంస్థల్లో ఏఐ వర్తింపజేయకూడదని కోరుకుంటున్నారు. అందుకే కంపెనీ యాజమాన్య సమాచారాన్ని పబ్లిక్ ఏఐ టూల్స్‌లో నమోదు చేయడం, అనుమతి లేని ఏఐ అప్లికేషన్లు ఉపయోగించడం, కంపెనీ అందించిన ఏఐ సిస్టమ్‌లను ఉపయోగించడానికి నిరాకరించడం వంటివి చేసినట్లు సర్వేలో బయటపడింది. అంతేకాకుండా పని సమీక్షలను మార్చడం లేదా ఏఐని పనికిరానిదిగా చూపించడానికి ఉద్దేశపూర్వకంగా తక్కువ ఉత్పత్తి చేసే పని చేయడం వంటివి ఇందులో భాగంగా చేస్తున్నట్లు తేలింది. దీనిని బట్టి ఏఐ గురించి ఉద్యోగుల మధ్య వ్యాప్తి చెందుతున్న ఫోబో (Fear of Becoming Obsolete) అనే భయం స్పష్టంగా కనిపిస్తోందని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు అంటున్నారు. ఏఐ తమ కెరీర్‌కు ముప్పుగా భావించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఇండియాలో.. ?
పలు ఇతర సర్వేలు కూడా ఏఐ యాక్టివిటీస్‌ని జెన్-Z ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోందని ధృవీకరిస్తున్నాయి. గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థల్లో ఒకటైన క్లైన్‌వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (KPMG) సర్వే ప్రకారం ప్రతీ 10 మందిలో నలుగురు ఉద్యోగులు ఏఐ వల్ల తమ ఉద్యోగం పోతుందని భయపడుతున్నారు. ఎన్‌బీసీ న్యూస్ పోల్ ప్రకారం అమెరికాలోని 26% మంది మాత్రమే ఏఐపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారు. 46 శాతం మంది ప్రతికూలంగా చూస్తున్నారు. ఈ పరిస్థితి ఏఐ అడాప్టేషన్(Adoption)ను క్లిష్టంగా మారుస్తోంది. అయితే ఈ సర్వేవెస్ట్రన్ దేశాలపైనే ఫోకస్ చేసింది. ఇండియా గురించి అందులో ప్రస్తావన లేదు కానీ.. ఇక్కడ కూడా ఐటీ, బీపీవో, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో జెన్-Z & మిలీనియల్స్‌లో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఎక్కువగా ఉందని ‘NASSCOM, TeamLease వంటి సర్వేలు పేర్కొన్నాయి.






