ఆ విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్న Gen Z.. కారణం ఇదేనా? కారణమా?

by Javid Pasha |   (  Updated:2026-04-08 09:11:22  IST  )

కంటెంట్ స్క్రోలింగ్, ఫిల్టరింగ్ విషయంలోGen Z యావరేజ్ దృష్టి సమయం 8 సెకన్లు ఉండగా, మిలీనియల్స్‌కు 12 సెకన్లు ఉంటున్నది.

ఆ విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్న Gen Z.. కారణం ఇదేనా? కారణమా?
X

దిశ, ఫీచర్స్ : ఒక విషయాన్ని పరిశీలించడంలో, స్వీకరించడంలో, దృష్టి కేంద్రీకరించడంలో అందరి ఆలోచనా ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా యువతకు, పెద్దలకు ఎంతో కొంత తేడా ఉంటుంది? వేర్వేరు కోణాల్లో ఆలోచించడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం కామన్. అయితే మిలీనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు), జెన్‌జీ(సుమారు 1997-2012 మధ్య జన్మించినవారు)ల మధ్య ప్రస్తుతం అదే జరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అనేక విషయాల్లో ఈతరం యువత సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నదని, మిలీనియల్స్ కంటే ఫాస్ట్‌గా విషయాలను, సమాచారాన్ని గ్రహించడంలో ముందుంటున్నదని పేర్కొంటున్నాయి. ఫాస్ట్- మూవింగ్ డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియాలో షార్ట్‌ఫామ్ వీడియోలు, రాపిడ్ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ వల్ల ఈ ధోరణి డెవలప్ అవుతున్నదని స్పష్టం చేస్తున్నాయి.

డిజిటల్ లైఫ్‌స్టైలే కారణం

సోషల్ మీడియా కంటెంట్ స్క్రోలింగ్ విషయానికే వస్తే Gen Z యావరేజ్ దృష్టి సమయం (attention span) సుమారు 8 సెకన్లు మాత్రమే ఉండగా, మిలీనియల్స్‌కు ఇది సుమారు 12 సెకన్లు ఉంటున్నదని మైక్రోసాఫ్ట్ అటెన్షన్ స్పాన్స్ రిపోర్ట్ (2015) పేర్కొన్నది. ఈ అధ్యయనంలో భాగంగా నిపుణులు కెనడాలో 2 వేలమందిని సర్వే చేసి, 112 మంది బ్రెయిన్ యాక్టివిటీని ఈసీజీ ద్వారా స్టడీ చేశారు. ఈ సందర్భంగా జెన్‌జీలు కంటెంట్‌ను వెంటనే గ్రహించడంలో, అర్థం చేసుకోవడంలో, అంచనా వేయడంలో మిలీనియల్స్‌ కంటే ఫాస్ట్‌గా మారిపోయిందని, ప్రతీ విషయంలో సెలెక్టివ్‌గా ఉండేందుకు ఇష్టపడుతోందని, సగటు దృష్టి సమయం 12 సెకన్ల నుంచి 8 సెకన్లకు తగ్గిందని గుర్తించారు. ఇందుకు ప్రధాన కారణం డిజిటల్ లైఫ్‌స్టైల్, సోషల్ మీడియా వినియోగం, మల్టీ-స్క్రీన్ ఉపయోగించడమేనని స్పష్టం చేశారు.

8 సెకన్లు చాలు..

డిజిటల్ లైఫ్‌స్టైల్ యువతరం ఆలోచనల్లో, వైఖరుల్లో, పలు విషయాలపట్ల విశ్లేషణల్లో మార్పునకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాపిడ్ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ వంటి కంటెంట్ మెదడును త్వరగా సమాచారం ప్రాసెస్ చేసి, వెంటనే మరో సమాచారానికి మారేలా శిక్షణ ఇస్తున్నది. ఫలితంగా యువత త్వరగా స్క్రోల్ చేస్తూ, ఆసక్తికరమైన లేదా వాల్యూబుల్ అనిపించే కంటెంట్‌ను మాత్రమే ఎంచుకుంటున్నది. అంటే ఇక్కడ యూత్ 8 సెకన్లలోపే ఈ విషయాన్ని గ్రహిస్తున్నది. తాము చూసేది, స్క్రోల్ చేసేది ఆసక్తికరంగా లేకపోతే వెంటనే ఆ కంటెంట్‌ను జంప్ చేసి మరో కంటెంట్‌లోకి వెళ్లిపోతుంది. ఫాస్ట్ మూవింగ్ వీడియోల మాదరిరే యువత మెదళ్లు కూడా సమాచారాన్ని ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయడానికి, గ్రహించడానికి అనుగుణంగా అలవాటుపడుతున్నాయి. నిజానికి ఇది క్లినికల్ లేదా మెడికిల్ విజన్ ప్రాబ్లం కాదు. డిజిటల్ లేదా సోషల్ మీడియా యుగంలో మెదడు ఎంత సెలెక్టివ్‌గా మారిపోతున్నదో, ఎంత త్వరగా సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుందో చెప్పగలిగే ఒక బిహేవియరల్ మెథడ్ అంటున్నారు నిపుణులు.

Next Story