- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fraud : ఆశలు కల్పించి మోసం చేసే ధోరణి.. ‘Future Fakin’తో నష్టపోతున్న యూత్
Fraud : ఆశలు కల్పించి మోసం చేసే ధోరణి.. ‘Future Fakin’తో నష్టపోతున్న యూత్

దిశ, ఫీచర్స్ : ఫ్యూచర్ ఫేకింగ్.. అనే మాట మీరెప్పుడైనా విన్నారా..? ఇటీవల సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దూసుకుపోయిన అనేక అంశాల్లో ఇదొకటి. కాగా ఈ మధ్య యువతీ యువకుల్లో ఈ ధోరణి పెరిగిపోతోందని నెటిజన్లు, నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫ్యూచర్ అంటే భవిష్యత్తు.. ఫేకింగ్ అంటే నకిలీ లేదా ఉత్తిదే.. అంటే ఒక విషయంలో అత్యుత్సాహం, అతి అంచనాలు, అవవసర వాగ్దాలు కలిగి ఉండటం, చివరికి వాటిని నెరవేర్చలేక నిరాశకు గురికావడం లేదా ఇతరులను మోసం చేయడం, నిరాశకు గురిచేయడాన్నే ఇక్కడ ‘ఫ్యూచర్ ఫేకింగ్’ గా నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల చివరికి మిగిలేది శూన్యమే. కాబట్టి లవ్, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్ వంటి సంబంధాల్లో ఈ ధోరణి పెరిగిపోతే సంబంధాలు దెబ్బతింటాయని, భవిష్యత్తులపై ఆశలు సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక విషయం.. రెండు కోణాలు
‘‘బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి జాబ్ తెచ్చుకోవచ్చు’ అని పేరెంట్స్ తమ పిల్లలకు చెబుతుంటారు. భవిష్యత్తులో అలా జరుగుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పిల్లల మంచికోసం ఇలా చేస్తారు. దీనివల్ల ఎలాంటి నష్టమూ లేదు. పైగా పిల్లలకు ప్రేరణగా ఉంటుంది. కానీ ఫ్యూచర్ ఫేకింగ్(Future faking)ఇందుకు భిన్నం. ఒక వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తితో భవిష్యత్ గురించి, తాను చేయబోయే పనుల గురించి గొప్పలు చెబుతూ ఆకట్టుకుంటారు. ‘నీ కోసం ఏదైనా చేస్తా’నంటూ వాగ్దానం చేస్తారు. ఇలా చెప్పడం ద్వారా ఎదుటి వ్యక్తిలో ఆశలు కల్పించి, భ్రమల్లో ముంచి వాస్తవ జీవితంలో ఆమెను లేదా అతన్ని శారీరకంగా, ఆర్థికంగా ఉపయోగించుకుంటారు. అంటే ఇక్కడ కేవలం ఆశ పెట్టి, అవసరానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే నటిస్తారు. ఈ ధోరణి వల్ల ఒకరు మోసం చేస్తే.. మరొకరు మోసపోతారు. ఇటీవల ప్రేమలు, సంబంధాల్లో ఈ ధోరణి అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
నమ్మించి మోసం చేయడం
భవిష్యత్తులో ఏదో చేస్తామని ఆశలు రేకెత్తించడం, అబద్ధపు మాటలతో, వాగ్దానాలతో అవతలి వ్యక్తిలోని భావోద్వేగాలను తన స్వార్థానికి వాడుకోవడం, ప్రయోజనం పొందాక పక్కకు తప్పుకోవడమనే ‘ఫ్యూచర్ ఫేకింగ్’ ధోరణి ఎంతోమంది యువత బంగారు భవితను నాశనం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఒక ప్రేమిస్తున్నానని, తప్పక పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక వ్యక్తిలో ఆశలు కల్పించి శారీరకంగా దగ్గరై, చివరకు పెళ్లి చేసుకోకుండా మోసం చేయడమే వంటి ఫ్యూచర్ ఫేకింగ్ సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ప్రేమల్లో బ్రేకప్‌లు, ఆత్మహత్యలు, పెళ్లి తర్వాత విడాకులు, గొడవలు వంటివి కూడా ‘ఫ్యూచర్ ఫేకింగ్’ వాగ్దాలవల్ల జరిగే పరిణామాలుగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే భవిష్యత్తు గురించి ఇతరులు చేసే వాగ్దానాలతో, ప్రమాణాలతో వర్తమానంలో నష్టపోవడానికి ఎప్పుడూ సిద్ధ పడవద్దు అంటున్నారు నిపుణులు.
ఎందుకలా చేస్తారు?
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్తుపై అంచనాలు ఉంటాయి. మనకున్న ఉన్న శక్తి సామర్థ్యాలు, ఆసక్తులు, స్వార్థం, వనరులు, నెట్వర్క్‌ను బట్టి వాటికో లిమిటేషన్ ఉంటుంది. కానీ ‘ఫ్యూచర్ ఫేకింగ్’ బిహేవియర్ మాత్రం అందుకు భిన్నం. ఒక విధంగా ఇది వాగ్దానాలు, హామీల విషయంలో అవతలి వ్యక్తిని బలిచేయడమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ విధమైన ప్రవర్తన ఎందుకు వస్తుందో ప్రత్యేకించి చెప్పలేం. పుట్టి పెరిగిన వాతావరణం, సామాజిక సంబంధాలు, మీడియా, సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా కొందరిలో ఈ విధమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎలాగంటే.. తరచూ గొప్పలు చెప్పుకునే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉండే మరో వ్యక్తి కూడా క్రమంగా దానిని అలవర్చుకొని మరింత ఎఫెక్టివ్‌గా ‘ఫ్యూచర్ ఫేకింగ్’ చేయవచ్చు. లవ్, రిలేషన్ షిప్ విషయంలో మాత్రమే కాకుండా ఇతర అనేక విషయాల్లోనూ ఈ ధోరణి ఉండే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన దగ్గర కనీసం బైకు కొనేందుకు కూడా డబ్బులేదనుకోండి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం ‘మరో నెలరోజుల్లో నేను కారు కొనబోతున్నాను’ అంటాడు. తీరా సమయం వచ్చేసరికి కొనడు. పైగా ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. ఇక తాను గొప్పలు చెప్పుకున్న వ్యక్తి కనిపిస్తే గిల్టీగా ఫీలవడం, మొహం చాటేయడం చేస్తుంటాడు. ఇలా చాలామంది ‘ఫ్యూచర్ ఫేకింగ్’ వాగ్దానాలతో అలసిపోతుంటారని నిపుణులు చెప్తున్నారు.
ఎలా బయటపడాలి?
‘ఏదో ఒక రోజు’ లేదా ‘సమయం వచ్చినప్పుడు’ అనే వాగ్దానాలతో కూడాఫ్యూచర్ ఫేకింగ్ క్రియేట్ చేస్తుంటారు. అంటే వ్యక్తులు తాము చేయబోయే పనుల విషయంలో కచ్చితమైన తేదీలు లేదా చర్యలకు ఎప్పుడూ కట్టుబడి ఉండరు. ఫైనల్లీ వాస్తవ చర్యలు లేకుండా కాలం గడిచిపోతుంది. అయితే ఇటువంటి బిహేవియర్ నుంచి బయటపడాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సదరు ఫేకింగ్ క్రియేటర్లను సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తరచూ ప్రశ్నించడం, వాస్తవాలను చెప్పాలని సున్నితంగా కోరడం వంటివి మార్పునకు దోహదం చేస్తాయి. అలాగే బాధిత వ్యక్తులు కూడా తాము క్రియేట్ చేసే ఫేక్ సమాచారంవల్ల భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఆలోచించడంవల్ల అటువంటి వాగ్దానాలకు, అతి అంచనాలకు దూరంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అవసరమైతే సెల్ఫ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలులు, ట్రీట్మెంట్ వంటివి కూడా తీసుకోవచ్చు.
Read More : Dishadaily Webstories






