- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యూజన్ వేర్: ట్రెండ్ ముఖ్యమే.. కానీ కల్చర్‌ను కాపాడుకుంటూ..!
ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం కొత్త దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా నేటితరం యువతలో ఫ్యూజన్ వేర్‌కు విస్తృత ఆదరణ లభిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు ఫ్యాషన్ (Fashion) ప్రపంచం కొత్త దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా నేటితరం యువతలో ఫ్యూజన్ వేర్‌కు (Fusion wear) విస్తృత ఆదరణ లభిస్తోంది. సెలబ్రెటీలు సైతం ప్రత్యేక సందర్భాల్లో ఈ ఫ్యూజన్ వేర్ దుస్తువులు ధరిస్తుండటంతో యువతలో వీటిపై మరింత క్రేజ్ పెరిగింది. ఫ్యూజన్ వేర్ అంటే.. పాశ్చాత్య, భారతీయ సంప్రదాయాల (Indo-Western Culture) మేళవింపుతో కూడిన ప్రత్యేక శైలి. ఇందులో యువత పాతకాలపు శైలులను ఆధునిక స్పర్శతో మిళితం చేస్తూ కొత్త కొత్త స్టైల్స్‌ను ఆవిష్కరిస్తున్నారు. అంటే.. ఆధునికతకు ప్రాధాన్యం ఇస్తూనే, తమ మూలాలను మర్చిపోకుండా సాంప్రదాయాన్ని సరికొత్త రూపంలో ప్రతిబింబిస్తున్నారు.
ఇక ఈ ఫ్యూజన్ వేర్ ద్వారా వారు పంచుకుంటున్నది కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వం, సాంస్కృతిక వారసత్వం, ఆధునిక ప్రపంచంలో తమ స్థానాన్ని సూచించే ఒక ప్రత్యేక భావన. ఈ శైలి ఒకవైపు సంప్రదాయ భారతీయ వస్త్రధారణ అయిన కుర్తాలు, శారీలు, లెహంగాలు కనిపిస్తే, మరోవైపు వాటికి జీన్స్, క్రాప్ టాప్స్, జాకెట్లు వంటి పాశ్చాత్య వస్త్రాల మేళవింపు చోటుచేసుకుంటోంది. ఇవి ముఖ్యంగా డిజైనర్ ఫ్యాషన్ షోలలోనూ, పెళ్లిళ్లలోనూ విస్తృతంగా కనిపిస్తోండగా.. రోజు వారి జీవితంలో కూడా భాగంగా మారుతోన్నాయి. ఈ నేపథ్యంలో సబ్యసాచీ, మంజరీ వర్మా, మసాబా గుప్తా వంటి పెద్ద పెద్ద డిజైనర్ల దగ్గర నుంచి ఆన్‌లైన్ బ్రాండ్లు, స్టార్టప్‌ల వరకు తమ కలెక్షన్లలో ఫ్యూజన్ వేర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎందుకు అంతా క్రేజ్:
సాధారణంగా నేటి తరం యువత ప్రతి విషయంలోనూ ప్రత్యేకతను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ప్రత్యేకమైన శైలిలో దుస్తువులను ధరించటం వల్ల అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవచ్చని నేటితరం యువత భావిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పదుకొణె, ఆలియా భట్, సారా అలీ ఖాన్ వంటి వారు ఈ దుస్తులను ఈవెంట్లలో ధరిస్తూ యువతకు ఫ్యాషన్ ప్రేరణగా నిలుస్తున్నారు. దీంతో నేటితరం యువత ఫ్యూజన్ వేర్ దుస్తువులకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు, వ్యక్తిగత శైలిని, అభిరుచిని ఈ దుస్తులు ప్రతిబింబిస్తాయి. సంప్రదాయాన్ని ఆధునికంగా చూపించే అవకాశం కల్పిస్తాయి.






