- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SPERM RACING : ఇదెక్కడి కథరా బాబు.. స్పెర్మ్ రేస్ కూడా మొదలైపోయిందిగా.. లైవ్ టెలికాస్ట్ కూడా..
స్పెర్మ్ రేసింగ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. నిజంగా ఇది వర్కవుట్ అవుతుందా? అంటే ఎస్.. అంటున్నారు నిర్వాహకులు. ఇది కేవలం జోక్ కాదని..

దిశ, ఫీచర్స్ : స్పెర్మ్ రేసింగ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. నిజంగా ఇది వర్కవుట్ అవుతుందా? అంటే ఎస్.. అంటున్నారు నిర్వాహకులు. ఇది కేవలం జోక్ కాదని.. ఇంటర్నెట్ నవ్వేందుకు చేసిన ఆలోచన అస్సలు కాదని క్లారిటీ ఇచ్చారు. పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించే కార్యక్రమమని తెలిపారు. ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ గురించి www.spermracing.comలో ఫుల్ డిటెయిల్స్ అందించారు.
పురుషుల సంతానోత్పత్తి.. నిశ్శబ్దంగా పడిపోతుంది. కానీ ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు. ఫెర్టిలిటీలో ముఖ్యమైన స్పెర్మ్ ఎంత వేగంగా కదులుతుందనేది కొలవచ్చు, ట్రాక్ చేయవచ్చు. ఓ కాంపిటీషన్‌లో పరుగెత్తడం, బరువు ఎత్తడం లాగానే.. స్పెర్మ్ చలనశీలతను కూడా మెరుగుపరచవచ్చని చెప్పేందుకే ఈ రేస్ అని చెప్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు ఎవరూ జనాలు దీనిపై కాన్సంట్రేట్ చేసేలా చేయలేదని, ఇప్పుడు మేము చేస్తున్నామని.. దీన్ని ఒక హెల్తీ స్పోర్ట్‌గా మారుస్తామని చెప్పారు. స్పెర్మ్ రేసింగ్ అంటే స్పెర్మ్ రేసింగ్ గురించి మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని పోటీగా మార్చడం గురించి. పురుష సంతానోత్పత్తిపై ప్రజలు నిజంగా మాట్లాడాలనుకునే, ట్రాక్ చేయాలనుకునే, మెరుగుపరచాలనుకునేదిగా చేయడం గురించి. పరిశోధకులు, ఆపరేటర్ల బృందాన్ని ఒక్క చోట చేర్చి ఈ పోటీని భారీగా ప్లాన్ చేశామని.. ఎవరూ టచ్ చేయలేని టాపిక్‌ను టచ్ చేశామని చెప్తున్నారు నిర్వాహకులు.
కాగా ఈ రేస్ కోసం దాదాపు లక్షల మందిని శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ట్రెయిన్ చేసినట్లు తెలుస్తుండగా.. స్పెర్మ్ కోసం మొట్టమొదటి మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ కూడా నిర్మించారు. హై రిజల్యూషన్ కెమెరాలు ప్రతీ మైక్రోస్కోపిక్ కదలికను ట్రాక్ చేస్తాయి. గణాంకాలు, లీడర్ బోర్డులు, రీప్లేలతో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతాయి.ఇందులో రెండు టీమ్స్ పాల్గొనబోతుండగా.. ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, లైవ్ కామెంటరీలు అన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇక విజేతను నిర్ణయించే పద్ధతి సరళంగా ఉంటుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. నిర్దేశిత ఫినిష్ లైన్‌ను మొదట దాటిన స్పెర్మ్, మోడ్రన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ధృవీకరించబడి, విజేతగా ప్రకటించబడుతుంది. ఈవెంట్ వెబ్‌సైట్ spermracing.com ప్రకారం ఈ పోటీలో స్పెర్మ్‌లు రియల్ టైమ్‌లో ట్రాక్ చేయబడతాయి. మైక్రోఫ్లూయిడిక్ డివైస్ లేదా పెట్రీ డిష్ వంటి నియంత్రిత వాతావరణంలో జరుగుతుంది.






