- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెల్నెస్ చాలెంజెస్.. యువతను ఆకట్టుకుంటున్న నయా ట్రెండ్!
ఇండియాలో అనేకమంది సెలబ్రిటీలు 75 హార్డ్ చాలెంజ్‌ను ఫాలో అయ్యారు. బాలీవుడ్ నటి అలయా ఎఫ్ (Alaya F) దీనిని ఎక్కువ పాపులర్ చేసిన వ్యక్తిగా చెబుతారు. ఆమె దీనిని రెండుసార్లు పూర్తి చేసింది.

దిశ, ఫీచర్స్ : బహుశా మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వెల్‌నెస్ చాలెంజెస్ తెగ వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు, ప్రముఖులు ఏదో ఒక యాక్టివిటీ చేసి #వెల్‌నెస్ చాలెంజ్ పేరుతో ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిలో 75 హార్డ్ ఛాలెంజ్ కూడా ఒకటి. ఇది ప్రముఖఅమెరికన్ ఎంట్రప్రెన్యూర్, బెస్ట్ సెల్లింగ్ రచయిత, పబ్లిక్ స్పీకర్ & పాడ్‌కాస్టర్ అయిన ఆండీ ఫ్రిసెల్లా( Andy Frisella) క్రియేట్ చేసిన ఒక మెంటల్ టఫ్‌నెస్ ప్రోగ్రామ్. ఇంతకీ అది ఎందుకు ఫేమస్ అవుతోంది? ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్డ్ నుంచి సాఫ్ట్ వరకు..
75 హార్డ్ చాలెంజ్ ప్రకారం.. రోజుకు రెండు 45 నిమిషాల వర్కౌట్స్(ఒకటి బయట), ఆల్కహాల్, చీట్ మీల్స్‌లేని స్ట్రిక్ట్ డైట్, ఒక గాలన్ (సుమారు 3.7 లీటర్లు) నీళ్లు తాగడం, నాన్-ఫిక్షన్ బుక్ నుంచి 10 పేజీలు చదవడం, ప్రోగ్రెస్ ఫొటో తీయండం వంటివి రోజూ చేయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఇది క్రమశిక్షణ, పట్టుదలను పెంచడంలో భాగంగా రూపొందించబడిన వెల్నెస్ చాలెంజ్‌గా పేర్కొంటున్నారు. అయితే ఇది కఠినంగా ఉండటంతో ఇటీవల దాని సాఫ్ట్ వెర్షన్ 75 సాఫ్ట్ పాపులర్ అవుతోంది. ఇందులో రోజుకు 45 నిమిషాల వర్కౌట్, 3 లీటర్ల నీళ్లు, హెల్తీ డైట్ (ప్రత్యేక సందర్భాల్లో ఆల్కహాల్ తీసుకోవచ్చు), ఏ పుస్తకం నుంచైనా 10 పేజీలు చదవడం వంటివి ఉంటాయి. ఇక దీనికి ప్రోగ్రెస్ ఫొటో అవసరం లేదు.
అసలు టార్గెట్ అదే..
సాఫ్ట్ వెర్షన్ 75 చాలెంజింగ్ ట్రెండ్ మరింత సౌకర్యవంతంగా అనిపించడంతో బిగినర్స్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇక మరొక వెలనెస్ ట్రెండ్ 21-డే హాబిట్ చాలెంజ్. దీని ప్రకారం 21 రోజులు అనవసర విషయాలను పట్టించుకోకపోవడం, ఫిర్యాదులు చేయకపోవడం ప్రాక్టీస్ చేయాలి. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని చాలెంజర్స్ చెబుతున్నారు. అయితే జీవన శైలిలో సానుకూల మార్పులపై ఫోకస్ చేసేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి వెల్‌నెస్ చాలెంజెస్ వెనుక మానసిక, ఆరోగ్య సంరక్షణ లక్ష్యాలే ముఖ్యమని ఈ ట్రెండ్ క్రియేటర్లు, ఫాలోవర్లు చెబుతున్నారు.
ఇక్కడ పాపులర్ చేసింది వీళ్లే..
ఇండియాలో అనేకమంది సెలబ్రిటీలు 75 హార్డ్ చాలెంజ్‌ను ఫాలో అయ్యారు. బాలీవుడ్ నటి అలయా ఎఫ్ (Alaya F) దీనిని ఎక్కువ పాపులర్ చేసిన వ్యక్తిగా చెబుతారు. ఆమె దీనిని రెండుసార్లు పూర్తి చేసింది. ఆ తర్వాత 97 హార్డ్ చాలెంజ్ కూడా చేస్తోంది. అలాగే ప్రముఖ నటి, టీవీ ప్రెజెంటర్ మందిరా బేదీ (Mandira Bedi) కూడా ఇదే చాలెంజ్ చేస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ ఇచ్చింది. నటి నేహా ధూపియా(Neha Dhupia) కూడా ఈ చాలెంట్ చేసి, ప్రోత్సహించిన సెలబ్స్‌లో ఉన్నారు. దీంతోపాటు ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయన్‌పురియా (Ankit Baiyanpuria) కూడా ఈ చాలెంజ్‌తో వైరల్ అయ్యాడు.






