- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uric Acid : అక్కడ నొప్పి పుడుతోందా? యూరిక్ యాసిడ్ పెరిగిందేమో!
Uric Acid : అక్కడ నొప్పి పుడుతోందా? యూరిక్ యాసిడ్ పెరిగిందేమో!

దిశ, ఫీచర్స్ : కీళ్లల్లో నొప్పి పుడుతోందా? యూరినేషన్ సమయంలో మంటగా ఉంటోందా? వేళ్లు ఉబ్బినట్లుగా అనిపిస్తున్నాయా? అయితే అది మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలకు సంకేతం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయా భాగాల్లో వీటికి సంబంధించి స్ఫుటికాలు పేరుకుపోవడంవల్ల ఇలా జరుగుతుందని, శరీరంలో ఇది విపరీతంగా పెరిగితే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లక్షణాలను కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు.
*నిజానికి యూరిక్ ఆమ్లం (Uric acid)అనేది శరీరంలోనే ఉండే ఒక వ్యర్థ పదార్థమని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా పేరుకుపోతే మూత్రంలో మంట, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత పలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
*కిడ్నీలు (kidneys)యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేస్తాయి. కానీ ఎక్కువ మొత్తంలో అది శరీరంలో పేరుకుపోయినప్పుడు మూత్ర పిండాలు కూడా ఈ వ్యర్థాలను వడబోయడంలో అలసిపోతాయి. పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్ఫుటికాల రూపంలో బాడీ మొత్తం వ్యాపించి పేరుకుపోయే ప్రమాదం ఉంటుందని, ఇది అనారోగ్యాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడాలంటే వైద్య నిపుణులు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అవసరమైన మెడికేషన్స్ సూచిస్తారు. సమస్య ఎక్కువగా ఉంటే చికిత్స చేస్తారు. అయితే సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడైతే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా దాని నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగడం, రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం మేలు చేస్తుంది. కాఫీలో యూరిక్ ఆమ్లాన్ని తగ్గించే గుణాలున్నాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు.
*ఒక గ్లాస్ వాటర్‌లో యాపిల్ సైడర్ వెనిగర్(Apple Cider Vinegar) కలిపి తాగడంవల్ల కూడా యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అట్లనే పసుపును కూరల్లో, ఇతర వంటకాల్లో తరచుగా వాడుతూ ఉండాలి. ఇందులోని కర్కుమిన్ అనే సమ్మేళనం యూరిక్ యాసిడ్‌ను, మూత్రంలో మంటను తగ్గిస్తుంది. దీంతోపాటు ఓట్స్, యాపిల్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు, కూరగాయలు వంటివి యూరిక్ యాసిడ్‌ను నివారిస్తాయి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






