Health : చర్మం తరచుగా రంగులు మారుతోందా.. ? మీ గుండె రిస్క్‌లో ఉండొచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-08-05 12:16:33  IST  )

Health : చర్మం తరచుగా రంగులు మారుతోందా.. ? మీ గుండె రిస్క్‌లో ఉండొచ్చు..!

Health : చర్మం తరచుగా రంగులు మారుతోందా.. ? మీ గుండె రిస్క్‌లో ఉండొచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ స్కిన్ అలెర్జీలు రావడం సహజమే. కానీ కొన్ని చర్మ సమస్యలు మీ గుండె రిస్క్‌లో ఉందని తెలియజేసే సంకేతాలు కూడా కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా నీలి, ఎరుపు వంటి రంగుల్లోకి మారడం, కొన్నిసార్లు ఎర్రటి మచ్చలు, దద్దుర్లు కనిపించడం, వంటివి తరచుగా రిపీట్ అవుతుంటే మీ గుండె బలహీన పడి ఉండవచ్చునని ఇంటర్వెన్షనల్ కార్డియాలజి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఏయే చర్మ సమస్యలు ఎందుకు ఎలాంటి ముప్పును సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

*సైనోసిస్ : మీ స్కిన్ లేదా పెదవులు, గోర్లు నీలం రంగులో మారుతాయి. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. ఇది పుట్టుకతో వచ్చే గుండె లోపానికి వార్నింగ్ సిగ్నల్ కూడా కావచ్చు. కాబట్టి సైనోసిస్ బాధితుల్లో చర్మం రంగులు మారుతూ ఉంటే గనుక అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. తగిన చికిత్స ద్వారా రాబోయే హార్ట్ ప్రాబ్లమ్స్‌ను నివారించవచ్చు.

*క్లబ్బింగ్ : కొందరికి చేతి వేళ్లపైన గోర్ల చుట్టూ చీము పట్టడం, నొప్పి కలగడం వంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. దీనినే క్లబ్బింగ్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటంవల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులవల్ల తలెత్తవచ్చు లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిలోనూ ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి.

*చర్మంలో కొవ్వు నిల్వలు : కొందరిలో శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. చర్మంపై కొవ్వు నిల్వలు (Xanthomas) పసుపురంగు గడ్డలుగా కనిపిస్తే గనుక అనుమానించాల్సిందే. హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య తలెత్తుతుంది. అయితే తరచుగా ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటే గనుక గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

*పెటెచియా : సాధారణంగా చర్మం ఉపరితలం కింద రక్తస్రావం జరిగినప్పుడు కనిపించే చిన్నపాటి ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలను పెటెచియాస్ అంటారు. ఇవి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‌కు సంకేతం కావచ్చు. గుండె కవాటాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఏర్పడుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులకు దారితీస్తాయి.

*ఓస్లర్ నోడ్స్ : ఓ స్లర్ నోడ్స్ అనేవి అరి కాళ్లు, చేతి వేళ్లపైన, అరిచేతుల్లో చిన్నపాటి గాయాల మాదిరి కనిపంచే ఎరుపు రంగు మచ్చలు. ఇవి ఏవైనా గాయాలు కలిగినప్పుడు, ముండ్లు గుచ్చుకున్నప్పుడు నిలిచిపోయిన గాయాల మాదిరి కనిపిస్తుంటాయి. గుండె జబ్బుల ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*స్పైడర్ వీన్స్ : కొందరిలో చర్మంలోని నరాలు ఉబ్బినట్లు పైకి కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితినే స్పైడర్ వీన్స్ లేదా సిరలు అంటారు. గుండె కవాటాల్లో లోపాలు లేదా కాలేయ వ్యాధితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. గుండె పనితీరును పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు జాగ్రత్త పడాలి. లేకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story