- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral news : మనసున్న మారాజు..! ఊరిజనం కోసం సొంత ఖర్చుతో నదిపై బ్రిడ్జ్ కట్టిన యువకుడు
Viral news : మనసున్న మారాజు..! ఊరిజనం కోసం సొంత ఖర్చుతో నదిపై బ్రిడ్జ్ కట్టిన యువకుడు

దిశ, ఫీచర్స్ : అక్కడక్కడా కొందరు ఉంటారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తుంటారు. రకరకాల పద్ధతుల్లో జనం ఎదుర్కొనే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. నిస్వార్థంగా తమకు తోచిన సాయం చేయాలని అనుకుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే సంజీవ్ కుమార్. ప్రస్తుతం ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అతను చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడనే కదా మీ సందేహం లెట్స్ గో అండ్ రీడ్ దిస్ స్టోరీ.
అది బీహార్ రాష్ట్రంలో గల ముజఫర్ పూర్ జిల్లాలోని కటారా గ్రామం(Katara Village). అయితే ఈ ఊరిగుండా ప్రవహించే బాగ్‌మతీ(bagmati river) నది, స్థానిక గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకంగా మారుతోంది. వర్షాకాలంలో అయితే ఉధృతంగా ప్రవహించడంతో చుట్టు పక్క గ్రామాల మధ్య కనెక్షన్ తెగిపోతుంది. పడవలు కూడా లేకపోవడంతో కటారా గ్రామ ప్రజలు మార్కెట్లకు, ఆస్పత్రులకు వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇలా ఇంకెంత కాలం? సరిగ్గా ఇదే ప్రశ్నే ఆ గ్రామంలోని సంజీవ్ కుమార్‌ను ఆలోచింపజేసింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి సొంతంగా పరిష్కారం ఆలోచించాలనుకున్నాడు.
ఇంకేముంది రూ.12 లక్షల సొంత ఖర్చు పెట్టి, 30 మంది కూలీల సహాయంతో 3,800 వెదురు బొంగులతో కటారాను బోక్చి బ్లాక్‌తో కలిపే విధంగా బాగ్మతీ నదిపై వంతెన నిర్మించాడు సంజీవ్ కుమార్(Sanjeev Kumar). అయితే ఇది ప్రభుత్వ పథకంలో భాగం మాత్రం కాదు. ఇక బ్రిడ్జిపై కాలినడకతో పాటు చిన్న చిన్న వాహనాలు, కార్లు, టూ వీలర్స్‌పై కూడా రాకపోకలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం కటారాతోపాటు చుట్టు పక్కల గ్రామాల మధ్య రాకపోకలకు సౌలభ్యం ఏర్పడింది. అయితే సంజీవ్ కుమార్ ఈ బంబూ బ్రిడ్జి (Bamboo bridge) నిర్వహణకోసం రాకపోకలు కొనసాగించే ఒక్కొక్కరి నుండి ₹20 టోల్ వసూలు చేస్తున్నాడు.






