Kidney Health : విటమిన్ బి6, బి9తో కిడ్నీలు సేఫ్.. ఏయే ఆహారాల్లో లభిస్తాయంటే..

by Javid Pasha |

Kidney Health : విటమిన్ బి6, బి9తో కిడ్నీలు సేఫ్.. ఏయే ఆహారాల్లో లభిస్తాయంటే..

Kidney Health : విటమిన్ బి6, బి9తో కిడ్నీలు సేఫ్.. ఏయే ఆహారాల్లో లభిస్తాయంటే..
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. రక్తంలోని వ్యర్థాలను వడబోసి యూరిన్ రూపంలో బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అట్లనే జీవక్రియను మెరుగు పరుస్తాయి. మూత్ర పిండాలు సక్రమంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే అవి బలహీన పడతాయో అప్పుడు అనారోగ్యాలు సంభవిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకోసం సహాయపడే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహారాలేవో చూద్దామా..

* మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సరిపడా నీరు తాగాలి. దీంతోపాటు బి6, బి9, విటమిన్ కె లభించే ఆహారాలు కిడ్నీలకు పనితీరును మరింత మెరుగు పరుస్తాయి. కాబటి ఆహారంలో భాగంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్డులోని తెల్లసొన, చేపలు, యాపిల్స్, వెల్లుల్లి, బీన్స్, చిక్కుళ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. వీటిలో బి6, బి9తోపాటు అనేక పోషకాలు లభిస్తాయి. లీఫ్ క్యాబేజీ కూడా కిడ్నీలకు చాలా మంచిది. ఫాస్పరస్, సోడియం, పొటాషియం తక్కువగా ఉండి, విటమిన్ బి6, బి9, విటమిన్ కె, ఫైబర్, ఫైటో కెమికల్స్, యాంటీ ఆన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

* మూత్ర పిండాల్లో సమస్యలు రాకుండా ఉంచే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ఇందులోని తెల్లసొనలో క్వాలిటీ ప్రొటీన్ ఉటుంది. కాబట్టి కిడ్నీలకు ఇది చాలా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీంతోపాటు వెల్లుల్లి కూడా మేలు చేస్తుంది. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉండటంవల్ల అధిక రక్తపోటును, ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ ఉండటంవల్ల ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తాయి. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ కలిగి ఉండటంవల్ల చేపలను ఆహారంగా తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది.

*ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు మూలం కాబట్టి యాపిల్స్ కూడా రోజూ లేదా అప్పుడప్పుడూ తింటూ ఉండాలి. వీటిలో ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఒమేగా -3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉన్నందున ఆలివ్ ఆయిల్ కూడా కిడ్నీలను సంరక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story