Technology : గాల్లో ఎగిరే రోబోటిక్ షాపింగ్ కార్ట్స్.. రోజువారీ సరుకుల రవాణా కోసం అభివృద్ధి చేసిన నిపుణులు

by Javid Pasha |

సియోల్ టెక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పాలెట్రోన్ అనే ఈ వినూత్నమైన ‘‘ఫ్లయింగ్ రోబో కార్ట్’’ అనే కార్గో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశారు.

Technology : గాల్లో ఎగిరే రోబోటిక్ షాపింగ్ కార్ట్స్.. రోజువారీ సరుకుల రవాణా కోసం అభివృద్ధి చేసిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : డీమార్ట్, మెట్రో వంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో వీటిని మీరు వినియోగించే ఉంటారు. లోపలికి వెళ్లేటప్పుడు సరుకులు తెచ్చుకోవడానికి నెట్టుకుంటూ తీసుకుపోగల చిన్న చిన్న ట్రాలీలు లేదా షాపింగ్ కార్ట్‌లు ఉంటాయి. అయితే వాటిని నేలమీద మాత్రమే నెట్టుకుంటూ తీసుకెళ్లగలం. పైఅంతస్తులకు పోవాలంటే.. లిఫ్ట్ ఉపయోగిస్తుంటాం. మరి మెట్లపై నుంచి వెళ్లాల్సి వస్తే.. వాటిని తీసుకెళ్లే చాన్స్ లేదు. కానీ ఇక నుంచి అలాంటి లోటును భర్తీ చేయవచ్చు చిన్న చిన్న ‘ఫ్లయింగ్ రోబో కార్ట్’లు. ఎందుకంటే కొరియాలోని సియోల్ టెక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పాలెట్రోన్ అనే ఈ వినూత్నమైన ‘‘ఫ్లయింగ్ రోబో కార్ట్’’ అనే కార్గో రవాణా వ్యవస్థను(Transportation system) అభివృద్ధి చేశారు.

జస్ట్ మనుషులు వాటిని పట్టుకుంటే చాలు.. గాల్లో సమాంతరంగా, మెట్ల ఎత్తుకు అనుగుణంగా ఎగురుతూ సరుకులను తీసుకెళ్లడానికి అనువైన ఫ్లయింగ్ కార్గోలు షాపింగ్ మాల్స్ నుంచి, గోడౌన్ల నుంచి సరుకుల రవాణాలో అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి రోబోటిక్స్, అలాగే మానవ పరస్పర చర్యను(Human interaction) అద్భుతంగా మిళితం చేయడం ద్వారా పనిచేస్తాయి. ఈ టెక్నికల్ సిస్టమ్ ఒక షాపింగ్ కార్ట్ ఆకారంలో చిన్నపాటి విశాలమైన ఫ్లాట్ సర్ఫేజ్‌( surface)తో రూపొందించబడి. అధునాతన మల్టీ రోటర్ ప్లాట్‌ఫామ్‌(multirotor platform)పై నిర్మితమై ఉంటుంది.

వినియోగదారులు ఒక హ్యాండిల్‌ను పట్టుకొని, తమ శక్తిని వినియోగించడం ద్వారా ఈ పాలెట్రోన్ ఫ్లయింగ్ కార్గోను నడిపించవచ్చు. అంటే ఒక విధంగా ఇది అడ్మిటెన్స్ కంట్రోల్ అండ్ డిస్టర్బెన్స్ అబ్జర్వర్ అల్గారిథమ్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. కాబట్టి ఇది శక్తిని కచ్చితంగా అంచనా వేస్తుంది. ట్రెడీషనల్ సరుకు రవాణా షాపింగ్ కార్ట్‌లు లేదా ట్రాలీల చక్రాలకు భిన్నంగా అవసరమైన ఎత్తులో మాత్రమే గాలిలోకి ఎగురుతూ సరుకులను మోస్తుంది. మెట్లపై నుంచి వెళ్లాల్సి వచ్చినప్పుడు వినియోగదారులు దానిని టచ్ చేసి పట్టుకుంటే చాలు గాలిలో తేలుతూ మీ నడకకు అనుగుణంగా ముందుకు కదులుతూ గమ్యం చేరుతుంది. దీని రూపకల్పనలో క్యూబిక్ ప్రొటెక్షన్ ఫ్రేమ్(Cubic protection frame), 8 యాక్చుయేటర్లు (Actuators), సున్నితమైన విమానం(smoother flight) కోసం లోపలి భాగంలో ప్రొపెలర్లు అమర్చబడి ఉంటాయని వాటిని రూపొందించిన నిపుణులు పేర్కొంటున్నారు. Link

Next Story