- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర చలితో ఫ్లూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
చల్లని శీతాకాల వాతావరణంలో, సీజన్లు మారినప్పుడు చాలా మందికి దగ్గు, జలుబుతో పాటు ఫ్లూ(ఇన్‌ఫ్లుయెంజా) వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : చల్లని శీతాకాల వాతావరణంలో, సీజన్లు మారినప్పుడు చాలా మందికి దగ్గు, జలుబుతో పాటు ఫ్లూ(ఇన్‌ఫ్లుయెంజా) వస్తుంది. ఇది వైరస్ వ్యాప్తి వల్ల వచ్చే అంటు వ్యాధి. ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల కంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఫ్లూ నుంచి ఉపశమనం పొందడానికి గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజుకు మూడు సార్లు గొంతులో పుక్కిలించడం వల్ల వైరస్ నశిస్తుంది. అంతేకాదు గొంతు సమస్యలు, ఛాతి పట్టేయడం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పుదీనా, నిమ్మ, యూకలిప్టస్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌ను గొంతుపై మర్దనా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపలు, మాంసం, పప్పు దినుసులు, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతం అవుతుంది, తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి మరియు వైరస్ నశించి ఫ్లూ నుంచి త్వరగా కోలుకుంటారు.






