- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలి కాలంలో నగ్నంగా పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఆహార పదార్ధాలన్నీ కల్తీమయమే అవుతున్నాయి. పెస్టిసైడ్స్‌తో కలుషితం అయిన ఫుడ్ తీసుకోని మనుషులు సర్వ రోగాల భారిన పడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఆహార పదార్ధాలన్నీ కల్తీమయమే అవుతున్నాయి. పెస్టిసైడ్స్‌తో కలుషితం అయిన ఫుడ్ తీసుకోని మనుషులు సర్వ రోగాల భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వ్యాయమాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలి కాలంలో నగ్నంగా పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. చలి కాలం అనగానే వెచ్చదనం కోసం ఉన్నితో తయారు చేసిన లావుపాటి దుప్పట్లలో దూరిపోతారు. కానీ దానికంటే ముందు దుస్తులు విప్పేసి నిద్రించడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
మెరుగైన రక్త ప్రసరణ :
నగ్నంగా పడుకోవడం వల్ల మొదట కలిగే ప్రయోజనం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలు బిగుతైన దుస్తులు ధరిస్తారు. ఇన్నర్ వేర్స్, లెగ్గింగ్స్, జీన్స్ వేసుకోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. ఈ కారణంగా చాలామందిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రాత్రి సమయంలో పూర్తిగా దుస్తులు విప్పేసి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ సరైన తీరిలో జరిగి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్, పోషకాల స్థాయిలు పెరుగుతాయి. కాంతివంతమైన చర్మంతో పాటు మృదువైన జుట్టును పొందుతారు.
కంట్రోల్‌లో బాడీ టెంపరేచర్ :
నగ్నంగా నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శరీరం వేడెక్కడం. ఉక్కపోయడం, అధిక చెమటలు పట్టడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
వెయిట్ లాస్:
నగ్నంగా నిద్రించడం వల్ల శరీరం కేలరీలు, కొలెస్ట్రాల్ బర్న్ అయ్యే మూలకాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. మరోవైపు శరీర ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచుతుంది. ఇవన్నీ అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచేవని వైద్యులు తెలుపుతున్నారు.
స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం:
నగ్నంగా పడుకోవడం వల్ల ప్రైవేట్ పాట్స్ వద్ద తేమ, వేడి స్థాయిలు తగ్గి బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మొటిమలు వంటి చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
మానసిక స్థితి మెరుగుపడుతుంది:
నగ్నంగా నిద్రపోవడం వల్ల సుఖవంతమైన నిద్ర వస్తుంది. బట్టల ఒత్తిడి కారణంగా వచ్చే అనేక రకాల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. మానసిక స్థితి, శక్తి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు నగ్నంగా పడుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.






