వెంటాడుతున్న ఆ ఆలోచనలు..! నిద్రలేని రాత్రులు గడుపుతున్న Generation Z‌

by Javid Pasha |

ఇటీవల కాలంలో జెన్ జీ(Generation Z)లలో సైతం నిద్రలేమి సమస్యలు అధికం అవుతున్నాయి.

వెంటాడుతున్న ఆ  ఆలోచనలు..! నిద్రలేని రాత్రులు గడుపుతున్న Generation Z‌
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు వయసు మీదపడిన వారే ఎక్కువగా నిద్రలేమితో బాధపడేవారు. కుటుంబ ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు, వృత్తి పరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు వంటివి ఇందుకు కారణం అయ్యేవి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల కాలంలో జెన్ జీ(Generation Z)లలో సైతం నిద్రలేమి సమస్యలు అధికం అవుతున్నాయి. 30 ఏండ్లలోపు యువతీ యువకులు సైతం రకరకాల ఆలోచనలతో, ఆందోళనలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని 2025 చివర్లో విడుదలైన ఒక అంతర్జాతీయ సర్వే పేర్కొన్నది. అందుకు గల ప్రధాన కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యువతరం ఏం ఆలోచిస్తోందో తెలుసుకోవడానికి ‘Deloitte Global Gen Z and Millennial Survey 2025’ పేరుతో ఈ ఏడాది చివర్లో ఇక అంతర్జాతీయ సర్వే జరిగింది. ఇందులో భాగంగా 44 దేశాల నుంచి మొత్తం 23,000 మందిని నిపుణులు విశ్లేషించారు. ఇందులో జెన్ జీలు(18 నుంచి 30 ఏండ్ల వయసు వరకు) 14,751 మంది కాగా, మిలీనియల్స్ 8,731 మంది ఉన్నారు. జెన్ జీలు(18 నుంచి 30 ఏండ్ల వయసు వరకు), మిలీనియల్స్‌లలో (29 నుంచి 44 ఏండ్ల వయసు వరకు) అందరూ కామన్‌గా ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందడంవల్ల కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడుపుతుండగా.. జెన్ జీలను మరికొన్ని అదనపు ఆలోచనలు సైతం వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జెన్ జీలల్లో 48% మంది ఆర్థిక భద్రత, నిరుద్యోగం వంటి సమస్యలతోపాటు ప్రేమ వైఫల్యాలు, అతి ఆలోచనలు, అనుకున్నది సాధిస్తామో లేదోననే ఆందోళన, సరైన భాగస్వామి దొరుకుతుందో లేదోననే ఆలోచన, జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదనే భావనతో సమమతం అవుతూ నిద్రకు దూరం అవుతున్నారు.

ఇక మిలీనియల్స్ (29 నుంచి 44 సంవత్సరాల వయసు వరకు)లో 46% మంది కేవలం ఆర్థిక పరమైన సమస్యల గురించి ఆలోచిస్తూ.. ఆందోళన చెందుతూ నిద్రకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితి ఇటు జెన్ జీలలో, అటు మలీనియల్స్‌లలో మానసిక ఒత్తిడిని, ఆందోళనలను పెంచుతూ భవిష్యత్‌పై ప్రభావం చూపుతోంది. కాగా ఈ సమస్యలను అధిగమించే మార్గాలు కూడా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో చర్చించడం, ముఖ్యమైన విషయాల్లో నిపుణులు, పెద్దల సలహాలు తీసుకోవడం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవడం వంటివి సమస్య నుంచి బయటపడేందుకు దోహదం చేస్తాయని సర్వేలను విశ్లేషించిన నిపుణులు సూచిస్తున్నారు.

Next Story