Viral Video: కన్నీళ్లు తెెప్పించేశావ్ భయ్యా..స్టేజీ పైనే చిన్ననాటి స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సినిమా డైరక్టర్.. వీడియో వైరల్

by Vennela |

Viral Video: ప్రేమకు జాతి లేదు కులం లేదు మతం లేదు ఇతర భేదాలు ఏమీ లేవు.

Viral Video: కన్నీళ్లు తెెప్పించేశావ్ భయ్యా..స్టేజీ పైనే చిన్ననాటి స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సినిమా డైరక్టర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ప్రేమకు జాతి లేదు కులం లేదు మతం లేదు ఇతర భేదాలు ఏమీ లేవు.. అలాగే ప్రేమకు సమయం సందర్భం కూడా ఉండవు అని నిరూపించేశాడు ఈ తమిళ యువ దర్శకుడు. తాను చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని తన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ప్రకటించి నెట్టింట వైరల్ బజ్ రాజేశాడు.

వివరాల్లోకి వెళ్తే తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్ స్టేజి పైనే ప్రియురాలికి ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. తాను డైరెక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను ఈ ఏడాది అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ప్రపోజ్ చేయగానే ఆయన ప్రియురాలు ఆనందభాష్పాలతో కనిపించింది.

జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించిన తర్వాత తమ ప్రేమను సాకారం చేసుకునే ఈ దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నెట్టింట మాట్లాడుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ఎలాంటి లక్ష్యమూ లేకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి రిస్కులో పడి చివరికి విడిపోయే, తొందరపాటు ప్రేమికులు ఉంటున్న ఈ కాలంలో, తాను ఒక టార్గెట్ పెట్టుకొని ఆ గోల్డ్ రీచ్ అయిన తర్వాత తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటున్న అభిషన్ జీవంత్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. యువత కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ తర్వాతే ప్రేమ పెళ్లి వంటి పనులు చేసుకోవాలని, అప్పుడే సమాజం కూడా గౌరవిస్తుందని తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తారని ఈ సందర్భంగా నెటిజన్స్ చెబుతున్నారు.



Next Story