శృంగారంలో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరకకుండా.. ‘ఫెస్టివల్ ఆఫ్ పెనిస్’

by Dishanational2 |
శృంగారంలో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరకకుండా.. ‘ఫెస్టివల్ ఆఫ్ పెనిస్’
X

దిశ, ఫీచర్స్ : ‘ఫెస్టివల్ ఆఫ్ పెనిస్’ గురించి ఎప్పుడైనా విన్నారా? జపనీయులు ప్రతి సంవత్సరం ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారని మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగే ప్రతి ఆచారానికి ఏదో ఒక కథ ఉన్నట్లే ఈ వింత కల్చర్‌కు బలమైన స్టోరీ ఉంది. మరి ఈ భిన్నమైన సంప్రదాయం ఎలా పురుడుపోసుకుంది? దీని వెనుకున్న అసలు కథేంటి? తెలుసుకుందాం!

జపాన్‌కు చెందిన కవాసకిలోని కనాయమా పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వసంతకాలంలో జరిగే జపనీస్ వేడుకను ‘షింటో కనమరా మత్సురి’, ‘స్టీల్ ఫాలస్ ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రధాన ఈవెంట్ ఏప్రిల్ మొదటి ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో భాగంగా పలు రకాల వస్తువులతో తయారు చేసిన కళాకృతులు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు, మిఠాయిలు, కూరగాయల అలంకరణలు ‘మికోషి కవాతు’ (పవిత్ర మత పల్లకి)లో ప్రదర్శించబడతాయి. ఈ కవాతులో ప్రధానంగా చూపించే మూడు పురుషాంగ నిర్మాణాలు.. ఏడాది పొడవునా స్థానిక మందిరంలో ఉంచబడతాయి. ఈ వసంతోత్సవం సందర్భంగా మాత్రమే అవి బయటకు తీసుకురాబడతాయి. అలాగే ఆ మూడు నిర్మాణాలను మోస్తున్న పురుషులు, మహిళలు గులాబీ రంగుల దుస్తుల్లో అలంకరించబడి దానికి సంప్రదాయబద్ధంగా అలంకరించుకుని వీధుల్లో నృత్యం చేయడం ప్రజలను ఆకట్టుకుంటుంది.

పండుగ వెనుక కథ

60వ దశకంలో కవాసకి చుట్టుపక్కల ఉండే సెక్స్ వర్కర్లు లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కోరుతూ కనయామా పుణ్యక్షేత్రాన్ని సందర్శించేవారు. ఈ మందిరంలో కమ్మరి, కనయామహికో అనే దేవతలు ఉన్నారని బలంగా నమ్ముతారు. ఇది శాస్త్రీయంగా పూర్తి సంబంధం లేని విషయం అనిపించినప్పటికీ.. షింటో అనే దేవత ఇజానామి అనే అగ్ని దేవుడికి జన్మనిచ్చిన తర్వాత మహిళలకు సోకే అనేక వ్యాధులను ఆమె నయం చేయగలిగారని ఒక జపనీస్ పురాణం పేర్కొంది. ఈ కారణంగా ప్రసవం తదనంతరం ఇతర సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు సహాయం కోసం ఈ దేవతలను వేడుకుంటున్నారు.

ఇదిలావుంటే.. ఒక రాక్షసుడు ఒక వివాహితతో ప్రేమలో పడిన తర్వాత ఆమె యోనిలోకి ప్రవేశించి శృంగార సమయంలో తన భర్త పురుషాంగాన్ని రెండుసార్లు కొరికినట్లు మరొక కథ వివరిస్తుంది. దీంతో సదరు స్త్రీ సహాయం కోసం కమ్మరి వద్దకు వెళ్లిందని, అప్పుడు భర్త పెనీస్‌కు ఒక మెటల్ ఫాలస్‌ను సృష్టించి ఇచ్చాడని, అది యోనిలోకి వెళ్లగానే కొరికేందుకు ప్రయత్నించిన ఆ రాక్షసుడి దంతాలు విరిగి నశించిపోయాడని గత చరిత్ర ఆధారాలున్నట్లు చెప్పుకుంటారు. దానిని కనయామా మందిరంలో ఒక రకమైన స్మారక చిహ్నంగా ఉంచడం విశేషం.

1969లో మొదటిసారి ఈ వింత కవాతు పురుడుపోసుకోగా ప్రస్తుతం ఇది HIV పరిశోధనకు నిధులు సమకూర్చడంలో సహాయపడే పర్యాటక ఆకర్షణగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఈ ‘కనమారా మత్సూరి’ పండుగ సంతానోత్పత్తి, సంబంధాలు, స్వలింగ సంపర్కం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి: అపరిమితమైన సెక్స్ కోసం చియా సీడ్స్..



Next Story

Most Viewed