- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Don't feed pigeons : పావురాలకు ఫీడింగ్ అందిస్తున్నారా..? వాటివల్ల పొంచి ఉన్న ముప్పు ఇదే..
Don't feed pigeons : పావురాలకు ఫీడింగ్ అందిస్తున్నారా..? వాటివల్ల పొంచి ఉన్న ముప్పు ఇదే..

దిశ, ఫీచర్స్ : ఇంటి వరండాలోనో, వీధి రోడ్డు పక్కనో కనిపించే పావురాలకు గింజలు, ఆహారం అందిస్తున్నారా? అయితే ఒకసారి ఆలోచించండి..! ఎందుకంటే జనసమూహాల్లో పావురాలకు ఫీడింగ్ అందించడం చివరికి మానవాళి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో పావురాల జనభా పెరిగితే.. వాటి విసర్జనలు, ఈకలు, గూళ్ల నిర్మాణాల వల్ల పర్యావరణ కాలుష్యం తలెత్తుతుంది. పలు రకాల వ్యాధుల వ్యాప్తికి దారితీస్తుంది. ఇంకా ఏయే సమస్యలు తలెత్తుతాయో చూద్దాం.
* శ్వాసకోశ వ్యాధులు : పావురాల విసర్జనలు, ఈకలు గాలిలో కలిసినప్పుడు అవి క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ (Cryptococcus neoformans) శిలీంద్రాలను, హిస్టోప్లాస్మా కాప్సులాటం(Histoplasma capsulatum) వంటి రోగకారక బ్యాక్టీరియాలను వ్యాప్తి చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఈ సమస్యలు వేగంగా ప్రభావం చూపుతాయి.
*అలెర్జీలు, ఆస్తమా : పావురాల ఈకలు, విసర్జనల దుమ్ము గాలిలో కలిసి అలెర్జీ రియాక్షన్లు, దురద, స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయి.
* సంక్రమణ వ్యాధులు : పావురాలు Salmonella లేదా E. coli వంటి బాక్టీరియాను వ్యాప్తి చేయవచ్చు. ఇవి ఆహార కాలుష్యం లేదా నీటి కాలుష్యం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. ఇక పావురాల విసర్జనలు సహజంగానే అపరిశుభ్రతను సృష్టిస్తాయి. ఇవి బాల్కనీలు, కిటికీలు, బహిరంగ ప్రదేశాలను కలుషితం చేస్తాయి.
*పావురాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించాలంటే.. జన సమూహాల్లో వాటి జనాభా పెరగకుండా చూడాలి. ఆహారం అందించడం వంటివి చేయవద్దు. అప్పుడు అవి అటవీ ప్రాంతాల్లోకి వెళ్తాయి. అలాగే ఇండ్లల్లోకి రాకుండా ఉండేందుకు బాల్కనీలు, కిటికీలు, బహిరంగ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పావురాల విసర్జనలను తాక కూడదు. తాకాల్సి వస్తే ముందు గ్లౌజులు, మాస్క్ ధరించాలి. Link






