లవర్‌‌తో గడపడం కంటే ఫేవరెట్ టీమ్ మ్యాచ్ గెలిస్తేనే కిక్

by Disha Web Desk 7 |
లవర్‌‌తో గడపడం కంటే ఫేవరెట్ టీమ్ మ్యాచ్ గెలిస్తేనే కిక్
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో అత్యంత ఎక్కువ కాలం నిజంగా సంతోషపెట్టే విషయాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. కానీ క్రీడాభిమానులకు మాత్రం తమ ఫేవరెట్ జట్టు మ్యాచ్ గెలవడం ఎక్కువ కాలం సంతోషాన్నిస్తుందని పరిశోధనలో తేలింది. సెప్టెంబరు 1, 2 తేదీల్లో Happé Café ప్రారంభోత్సవానికి గుర్తుగా క్యాపిటల్ వన్ UK సంస్థ ఈ పరిశోధన ప్రారంభించింది. ఇది యూకేలో మొట్టమొదటి డోపమైన్-ప్రేరేపిత కేఫ్ కాగా.. ప్రజలకు అవసరమైన మానసిక స్థితిని అందించేందుకు ఏర్పాటు చేయబడింది.

ఈ పరిశోధన విషయానికొస్తే 2000 మందితో ఒక పోల్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు మూడు మధురమైన పదాలు(నేను నిన్ను ప్రేమిస్తున్నాను) విన్నప్పుడు సగటున 4 గంటల పాటు ఆ సంతోషాన్ని అనుభవించినట్లు గమనించారు. కానీ ఫేవరేట్ టీమ్‌ గెలిచినప్పుడు మాత్రం ఆ బూస్టప్ 4.09 గంటల తర్వాత కూడా ఉందని వెల్లడైంది. ఇక ఎవరైనా కుటుంబంతో సమయం గడుపుతుంటే అది 4.33 గంటల పాటు సుదీర్ఘమైన ఆహ్లాదాన్నిస్తుందని, అలాగే జంక్ ఫుడ్ తినడం కంటే 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ప్రజలను సంతోషపరుస్తుందని ఈ పోల్ స్పష్టం చేసింది. ఇక ఏ విషయంలోనైనా బేరం కుదుర్చుకోవడం(Bargaining) అనేది 3.39 గంటల పాటు సంతృప్తినిస్తుండగా.. ఇది చాక్లెట్ బార్ తినడం, పొగడ్తలు స్వీకరించడం, వేడి రోజున చల్లటి ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడం కంటే ఉత్తమం కావడం విశేషం.

దీంతో పాటు శుక్రవారాన్ని ప్రజలు అత్యంత ఉల్లాసమైన రోజుగా భావిస్తున్నట్లు పరిశోధన పేర్కొంది. 10 మందిలో దాదాపు ఆరుగురు(59 శాతం) గొప్ప ఆర్భాటాలకు బదులు జీవితంలోని చిన్న చిన్న విషయాల పట్ల 'ఫీల్ గుడ్' భావన పొందుతారు. ఇక 68 శాతం మంది తమ సంతోషం కోసం ఎక్కువసార్లు టీ తాగుతుంటారని తెలిసింది. అన్నింటికీ భిన్నంగా 44 శాతం మంది ఇతరుల ఆనందానికి ప్రియారిటీ ఇస్తారని, 57 శాతం మంది ఇతరులను సంతోషపెట్టడం వల్ల తమ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్పారు.

Next Story

Most Viewed