- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Valentine's Day: వాలెంటైన్స్ డే నాడు ఇలా కనిపిస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. ఫ్యాషన్ టిప్స్ మీకోసం
Valentine's Day: ఫిబ్రవరి 14వ తేదీనాడు ప్రేమికుల రోజు. ప్రేమికులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: Valentine's Day: ఫిబ్రవరి 14వ తేదీనాడు ప్రేమికుల రోజు. ప్రేమికులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మాయిలు ప్రేమికుల రోజు అందంగా తయారయ్యేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతుంటారు. వాలెంటైన్స్ డే రోజు స్టైలిష్ గా కనిపించేందుకు కొన్ని ఫ్యాషన్ టిప్స్ మీకోసం. అవేంటో చూసేయ్యండి.
ఫిబ్రవరి నెల వస్తుందంటే ప్రేమికుల్లో ఉత్సాహం నెలకుంటుంది. ఇప్పుడు లవ్ వీక్ నడుస్తోంది. రోజ్ డే నుంచి మొదలై ప్రేమ వారం ఫిబ్రవరి 14వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమికులు ఈ రోజు కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. ఫిబ్రవరిలో వచ్చే ఈ ప్రత్యేకమైన రోజుకు ప్రేమ పక్షులు ముందుగానే రెడీ అవుతుంటారు. వాలెంటైన్స్ డే రోజు జంటలు డేట్ కు వెళ్తుంటారు. లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి నైట్ అవుట్ కు వెళ్తుంటారు. ఆ రోజు అమ్మాయిలు అందంగా కనిపించాలని కోరుకుంటారు. మీరు కూడా ఈ ప్రత్యేకమైన రోజు మీ భాగస్వామితో డేట్ కు వెళ్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ఫ్యాషన్ హ్యాక్స్ మీకు ఉపయోగపడతాయి. ఆవేంటో చూద్దాం.
ప్లెయిన్ రెడ్ డ్రెస్
వాలెంటైన్స్ డే రోజు రెడ్ కలర్ డ్రెస్ ధరిస్తే అద్భుతంగా కనిపిస్తారు. ఈ డ్రెస్ పై ఓపెన్ హెయిర్, న్యూడ్ మేకప్ తో స్టైల్ చేసుకోవచ్చు. ఈ రకమైన డ్రెస్ ను స్టడ్ ఆయర్ రింగ్స్, హై హీల్స్ వేసుకుంటే మెరిసిపోతారు. మరింత స్టైలిష్ గా కనిపించేందుకు స్లింగ్ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు.
కార్సెట్ టాప్
మోకాలి వరకు ఉన్న డెనిమ్ స్కర్ట్ తో అందమైన కార్సెట్ టాప్ ను వేసుకోవచ్చు. దీన్ని మీరు క్రాఫ్ట్ బాంబర్ జాకెట్, వైట్ స్నీకర్స్ తో లేదా లాంగ్ కోట్ స్టిలెట్టోస్ తో వేసుకోవచ్చు. జుట్టును కర్ల్ చేసి లీవ్ చేయాలి.
షైనింగ్ డ్రెస్
మీ భాగస్వామితో నైట్ డేట్ కు వెళ్తున్నట్లయితే షైనింగ్ డ్రెస్ లో అద్బుతంగా కనిపిస్తారు. ఈ రకమైన డ్రెస్ ను బోల్డ్ ఈయర్ రింగ్స్, ఆకర్షణీయమైన సిల్వర్ లేదా గోల్డ్ హీల్స్ తో వేసుకోండి. మేకప్ న్యూడ్ గా ఉంచి లిప్ స్టిక్ డార్క్ లేదా లైట్ డ్రెస్ కలర్ కు తగినట్లుగా సెలక్ట్ చేసుకోండి.
రెడ్ టాప్
మీ దగ్గర రెడ్ టాప్ ఉన్నట్లయితే వాలెంటైన్స్ డే కు వేసుకుంటే అందంగా కనిపిస్తారు. ఈ టాప్ ను బేజ్ మినీ స్కర్ట్, మోకాలి వరకు ఉన్న కిట్టెన్ బూట్లతో వేసుకోండి. దీంతోపాటు స్లింగ్ బ్యాక్ ను కూడా క్యారీ చేయండి. ఈ లుక్ లో మీ జుట్టును హాఫ్ బన్ లో వేసుకోవచ్చు.






