- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : ఫోన్ స్క్రీన్‌పై క్రాక్స్.. ఎంత డేంజరో తెలుసా?
స్క్రీన్ క్రాక్ అయిన ఫోన్ వేడెక్కుతుంటే అది ప్రమాదకరమైన సంకేతంగా గుర్తించాలి. ఇది బ్యాటరీలో సమస్యలు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు ఫోన్ కింద పడ్డప్పుడో, ఎక్కువకాలం వాడటంవల్లో దాని స్క్రీన్‌పై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఏం అవుతుందిలే అని అలాగే వదిలేస్తుంటారు చాలామంది. కానీ ఇది డేంజర్ అని మీకు తెలుసా? స్క్రీన్ క్రాక్ అవడమంటే కేవలం లుక్ మారిపోవడం మాత్రమే కాదు, అది యూజర్ల భద్రతకూ ముప్పేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఫోన్ స్క్రీన్‌లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఒక చిన్న క్రాక్(crack) కూడా కాలక్రమేణా లోపలి భాగాలకు నష్టం కలిగించి, టచ్ సెన్సార్, డిస్‌ప్లే, ఇంటర్నల్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రభావితం చేయవచ్చు.
వేడెక్కుతుంటే..
స్క్రీన్ క్రాక్ అయిన ఫోన్ వేడెక్కుతుంటే అది ప్రమాదకరమైన సంకేతంగా గుర్తించాలంటున్నారు నిపుణులు. ఇది బ్యాటరీలో సమస్యలు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు. కొన్నిసార్లు అధిక వేడి ఏర్పడితే బ్యాటరీ హీటెక్కి మంటగా మారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పగుళ్లు ఏర్పడిన ఫోన్ హీటెక్కడం గమనిస్తే ఉపయోగించడం ఆపివేసి, వెంటనే స్విచ్చాఫ్ చేయాలి. తర్వాత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి రిపేర్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
స్పైడర్ వెబ్ ఫ్రాక్చర్
ఫోన్ స్క్రీన్‌పైన చివరి మూలల్లో ఏర్పడే చిన్న క్రాక్స్ పెద్ద డేంజర్ కాకపోవచ్చు కానీ.. స్క్రీన్ మొత్తం మీద స్పైడర్ వెబ్ లాంటి (like a net) క్రాక్స్ ఉంటే మాత్రం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పగుళ్ల ద్వారా తేమ లోపలికి చేరి ఫోన్ ఇంటర్నల్ పార్ట్స్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్క్రీన్‌గ్వార్డ్ లేదా ఫోన్ మార్చడమో చేయడం బెటర్ అని సూచిస్తున్నారు.
ఏం చేయాలి?
స్క్రీన్‌పై పగుళ్లు ఏర్పడినప్పుడు ఫోన్ హీటెక్కడం లేదా అసాధారణ సమస్యలు కనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి. వీలైతే అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్ టెన్నీషియన్‌తో సరిచేయించుకోవాలి. ప్రాబ్లం సాలో కాకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లి రిపేర్ చేయించుకోవాలి. చిన్న క్రాక్స్ కదా.. అని వదిలేస్తే తర్వాత ఫోన్ డ్యామేజ్ అవ్వొచ్చు లేదా మొత్తానికే ఫోన్ పాడైపోవచ్చు. అందుకే జాగ్రత్త అవసరం.






