- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seasonal mood : లేజీనెస్ ఎందుకు వస్తుంది..? పోవాలంటే ఏం చేయాలి?
చలికాలంలోనే బద్ధకం ఎక్కువగా ఆవహించడానికి ప్రధాన కారణం సూర్య రశ్మి తక్కువగా ఉండటమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దిశ, ఫీచర్స్ : లేజీనెస్.. చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య ఇది. వాస్తవానికి బద్ధకం అనేది స్పృహలో అసాధారణ తగ్గుదలని సూచించే ఒక లక్షణం. మానసిక స్థితిలో మార్పునకు కారణం అవుతుంది. దీనివల్ల బాధితులు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడంలో సమస్యను ఎదుర్కోవచ్చు. చాలా మంది వింటర్ సీజన్‌లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పటికీ, పొద్దున్నే నిద్ర లేవాలంటే అస్సలు నచ్చదు. బాడీ మొత్తం లేజీగా ఉంటుంది. అయితే ఈ సీజనల్ మూడ్ స్వింగ్స్ వల్ల మీరు నష్టోయే అవకాశం ఎక్కువ. కాబట్టి దానిని వదిలించుకోవాలంటున్నారు నిపుణులు.
చలికాలంలోనే బద్ధకం ఎక్కువగా ఆవహించడానికి ప్రధాన కారణం సూర్య రశ్మి తక్కువగా ఉండటమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కారణంగా శరీరానికి కావాల్సిన విటమిన్ డి సరిగ్గా అందదు. ఫలితంగా యాక్టివ్‌నెస్ తగ్గుతుంది. నీరసం ఆవహిస్తుంది. శరీరం మొత్త లేజీగా మారిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. డైలీ ఉదయం కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయడం, రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోవడం కంటిన్యూ చేయాలి. దీంతో మార్నింగ్ ఆటోమేటిక్‌గా నిద్ర లేవడానికి మీ బాడీ సంసిద్ధం అవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే వివిధ వ్యాయామాలతోపాటు యోగా, మెడిటేషన్, డ్యాన్స్ వంటివి కూడా బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచడం ద్వారా మానసిక స్థితిని మెరుగు పర్చి, లేజీనెస్‌ను పోగొడతాయంటున్నారు నిపుణులు.






