Health : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఆహారాలను తగ్గిస్తే బెటర్ !

by Javid Pasha |   (  Updated:2025-05-16 13:15:26  IST  )

Health : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఆహారాలను తగ్గిస్తే బెటర్ !

Health : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఆహారాలను తగ్గిస్తే బెటర్ !
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలు అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధిక రక్తపోటు(high blood pressure) సమస్య చాలామందిని వేధిస్తోంది. యువత కూడా దీనిబారిన పడుతోంది. నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం, గుండె పోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఉప్పు అధికంగా వాడటంతోపాటు కొన్ని రకాల ఆహారాలు కూడా హైబీపీని పెంచుతాయి. కాబట్టి వాటిని నివారించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ఒబేసిటీ నుంచి అధిక రక్తపోటు వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్(Processed foods) ఎక్కువగా తినడం కారణం అవుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు సోడియం అధికంగా ఉండే ప్యాకేజ్ నూడుల్స్, చిప్స్, స్నాక్స్, బిస్కెట్స్ వంటివి రెగ్యులర్‌గా తింటూ ఉంటే హైబీపీ పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి అధికరక్తపోటును పెంచుతాయి. కాబట్టి ఈ ఆహారాలను తగ్గించాలి.

ఆయిలీ ఫుడ్స్

హైబీపీ((high blood pressure)) సమస్య ఉన్నవారు ఎక్కువసేపు నూనెలో వేయించిన ఆహారాల(Foods fried in oil for a long time)ను కూడా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా పకోడీలు, పూరీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటివి రుచిగా అనిపించవచ్చు. కానీ బీపీ సమస్య ఉన్నవారిలో ఇవి హైబీపీకి కారణం అవుతాయి. దీంతోపాటు అధిక సోడియం కలిగిన ఏ ఆహారాలు కూడా అంత మంచిది కాదు. మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ ఊరగాయ, అప్పడాలు, వడియాలు కూడా ఎక్కువగా తినవద్దు అంటున్నారు నిపుణులు. అధిక చక్కెరలు కలిగిన చాక్లెట్లు, స్వీట్లు వంటి బేకరీ ఫుడ్స్ కూడా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెచడంవల్ల సిరలు బిగుసుకుపోయి అధిక రక్తపోటు పెరగడానికి దారితీస్తాయంటున్నారు. కాబట్టి హైబీపీ ఉన్నవారు వైద్య నిపుణుల సలహాలు పాటించాలి. బీపీని కంట్రోల్లో ఉంచగలిగే ఆహారాలకు ప్రయారిటీ ఇవ్వాలి.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story