పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే !

by Javid Pasha |

పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే !

పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. ? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే !
X

దిశ, ఫీచర్స్ : ఉరుకులు, పరుగుల నగర జీవితంలో తమ పిల్లల్ని చూసుకోవడం పేరెంట్స్‌కు సవాలుగా మారుతోంది. భార్యా భర్తలు ఉద్యోగం చేసేవారైతే పిల్లలతో సరదాగా గడిపే సమయం, వారి ఆలనా పాలనా చూసే సమయం చాలా తక్కువే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

సమయం - సద్వినియోగం

అన్ని రోజుల్లో పిల్లలతో గడిపే అవకాశం అందరికీ లేకపోవచ్చు. అలాంటప్పుడు తమ సెలవు రోజుల్లో ఎక్కువ సమయం కేటాయించడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇతరత్రా పనులున్నా మీ చిన్నారులకు దగ్గరగా ఉంటూనే చేసుకోవడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు తమ కళ్లముందు ఉన్నప్పుడు పిల్లలు పొందే మానసిక ఆనందం, అనుభూతి వారిలో మానసిక వికాసానికి, దృఢమైన మనస్తత్వానికి దోహదం చేస్తుంది.

గేమ్స్‌లో పాల్గొనేలా..

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. అందుకే పేరెంట్స్ తమ పిల్లలు ఫోన్లలో నిమగ్నం అవకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వారిని ఔట్ డోర్ గేమ్స్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. సమయం ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి సైక్లింగ్, స్విమ్మింగ్, వివిధ గేమ్స్‌లో పాల్గొంటూ వారిని ప్రోత్సహించడం చాలా మంచిది. ఇవి శారీరక డృఢత్వానికి ఉపయోపడతాయి. దీంతోపాటు తగిన పోషకాహారం అందించడం ముఖ్యమనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.

Next Story