వింటర్‌లో డైలీ స్నానం చేస్తున్నారా..? మంచిది కాదంటున్న నిపుణులు!

by Javid Pasha |

డైలీ కాకుండా వారానికి 2–3 సార్లు స్నానం చేస్తే మంచిదని డెర్మటాలజిస్టులు అంటున్నారు. దీనివల్ల చర్మం సమతుల్యంగా (balanced), ఆరోగ్యంగా (healthy) ఉంటుంది.

వింటర్‌లో డైలీ స్నానం చేస్తున్నారా..? మంచిది కాదంటున్న నిపుణులు!
X

దిశ, ఫీచర్స్ : పరిశుభ్రతలో భాగంగా మనం సహజంగానే ప్రతి రోజూ స్నానం చేస్తుంటాం. అయితే స్నానం మంచిదే కానీ.. డైలీ చేయడం చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు డెర్మటాలజిస్టులు. వారంలో మూడు లేదా నాలుగు రోజులు చేస్తే చాలని చెబుతున్నారు. రోజూ చేయడంవల్ల కొన్ని నష్టాలు ఉన్నాయంటున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD), మయో క్లినిక్ అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. ఆ వివరాలేమిటో చూద్దాం

*రోజూ స్నానం చేయడంవల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా చర్మంలో ఆరోగ్యానికి మేలు చేసే సహజ నూనెలు(natural oils) తొలగిపోయి పొడి(dryness)గా మారుతుంది. ఇరిటేషన్ కలిగిస్తుంది.

*డైలీ కాకుండా వారానికి 2–3 సార్లు స్నానం చేస్తే మంచిదని డెర్మటాలజిస్టులు అంటున్నారు. దీనివల్ల చర్మం సమతుల్యంగా (balanced), ఆరోగ్యంగా (healthy) ఉంటుంది. రోజూ స్నానం చేయకపోయినా చర్మం తాజా దనాన్ని కోల్పోదు. రెండు మూడు రోజులకోసారి చేస్తే చాలు.

సహజ నూనెల ప్రాముఖ్యత : చర్మం మీద ఉండే సహజ నూనెలు (natural oils) దానిని మృదువుగా, తేమగా, రక్షణగా ఉంచుతాయి. అయితే రోజూ స్నానం చేయడం వల్ల ఇవి తొలగిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. చికాకు కలుగుతుంది.

డైలీ స్నానంతో దుష్ప్రభావాలు : రోజూ లేదా తరచుగా స్నానం చేస్తే చర్మంపై ఉండే రక్షణ పొర (skin barrier) దెబ్బతింటుంది. ఇది అలర్జీలు, ఎగ్జిమా వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది.

ఇలా చేస్తే బెటర్

వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే స్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. మధ్యలో అవసరమైతే గోరు వెచ్చని నీటితో ముఖం, చంకలు, ప్రైవేట్ భాగాలు తడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ వేడిగా ఉండే నీరు వాడకపోవడం మంచిది. ఎందుకంటే నూనెలను మరింత తొలగిస్తుంది.

సబ్బు వాడకం తగ్గించండి

పూర్తి షవర్ సమయంలో కూడా సబ్బును మొత్తం శరీరానికి కాకుండా, కేవలం చంకలు, పాదాలు, గజ్జలు వంటి భాగాలకు మాత్రమే ఉపయోగించండం మంచిదని చర్మ వ్యాధి నిపుణులు అంటున్నారు. మిగతా చోట మెత్తని క్లెన్సర్ లేదా సాదా నీరు సరిపోతుందని చెబుతున్నారు. స్నానం తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాయడం ద్వారా చర్మం తేమను లాక్ చేసుకుంటుంది. ఇది పొడి సమస్యను నివారిస్తుంది.

ఎవరికి ఎక్కువ స్నానం అవసరం : ఎక్కువగా వ్యాయామం చేసేవారు, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పనిచేసేవారు రోజూ స్నానం చేయవచ్చు. కానీ సబ్బు తక్కువగా ఉపయోగించాలి.Link

Next Story