Weight Loss Tips : అధిక బరువు, ఊబకాయంతో అవస్థలా..? మిమ్మల్ని స్లిమ్‌గా మార్చేసే టిప్స్ ఇవిగో..!

by Javid Pasha |   (  Updated:2025-06-09 10:11:09  IST  )

Weight Loss Tips : అధిక బరువు, ఊబకాయంతో అవస్థలా..? మిమ్మల్ని స్లిమ్‌గా మార్చేసే టిప్స్ ఇవిగో..!

Weight Loss Tips : అధిక బరువు, ఊబకాయంతో అవస్థలా..? మిమ్మల్ని స్లిమ్‌గా మార్చేసే టిప్స్ ఇవిగో..!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం(Overweight, obesity) కూడా ప్రధానంగా ఉంటున్నాయి. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి వంటివి సాధారణంగా ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే నిర్లక్ష్యం చేస్తే ఇవి రెండు కూడా తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి. హైబ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక శరీరాకృతిలో వచ్చే మార్పులవల్ల అట్రాక్షన్ కోల్పోతారు. ఇవన్నీ జరగకూడదంటే తగిన బరువు నిర్వహణ చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*రోజువారీ అలవాట్లు కూడా బరువు నిర్వహణలో కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి మీరు అధిక బరువు తగ్గాలంటే ప్రతిరోజూ ఉదయం తొందరగా నిద్రలేవడం, ఉదయపు సూర్యోదయం వేళ కాసేపు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవడం అవసరం. దీనివల్ల బాడీకి విటమిన్ డి అందుతుంది. అలాగే వాకింగ్, జాగింగ్, యోగా ఇలా మీకు నచ్చిన వ్యాయామాలు కనీసం 45 నమిషాలైనా చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. అధిక బరువు, ఊబకాయం వంటివి తగ్గిపోతాయి.

*తినే ఆహారం కూడా ఊబకాయాన్ని, అధిక బరువును పెంచుతుంది. కాబట్టి సరైన డైట్ పాటించాలి. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తిన కూడాదు. నిర్దష్ట సమయంలోనే అది కూడా సమతుల ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్ర భోజనాలు చేయడం మంచిది. అయితే తిన్న ప్రతిసారీ కడుపు టైట్‌గా అయ్యేదాక తినకూడదు. లిమిట్‌లో తినాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ నివారించాలి. సరిపడా నీళ్లు కూడా తాగాలి. ఈ విధమైన డైలీ హాబిట్ మీలో అధిక బరువును తగ్గించి స్లిమ్‌నెస్‌ను

* ఏమాత్రం టైమ్ దొరికినా స్మార్ట్‌ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతుంటారు కొందరు. ఊబకాయం, అధిక బరువు సమస్యలు పెరగడానికి ఈ అలవాటు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే దీనివల్ల బద్ధకం మొదలవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గుతాయి. కాబట్టి ఫోన్లు, టీవీలు, గాడ్జెట్స్ వంటి వాటికి లిమిటెడ్ టైమ్ కేటాయించాలి. ఎంతలేదన్నా రోజుకు కనీసం 10 వేల అడుగులు వేయడం మంచిది. నిమిషానికి 80 నుంచి 120 అడుగులు నడక కొనసాగిస్తే కేలరీలను బర్న్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అధిక బరువు, ఊబకాయం తగ్గుతాయి. అయితే త్వరగా తగ్గాలని, కొన్ని రోజుల్లోనే స్లిమ్‌గా మారిపోవాలని ఆహారం మానేయడం కానీ, అధిక వ్యాయామాలు కానీ అస్సలు చేయకూడదు. ఏదైనా ఒక పరిమితిలో ఉండాలి. అవసరమైతే ఆరోగ్య నిపుణులను, వ్యాయామ నిపుణులను సంప్రదించి సలహాలు పాటించడం బెటర్.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story