- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఫోన్‌లోని స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ సేఫేనా? ప్రైవసీ కోసం ఇలా చేస్తే చాలు..!
పాస్‌వర్డ్‌తో పాటు దానికి మరింత సేఫ్టీని జోడించడానికి టూ- ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసిపోయినా, మీ ఫోన్ డేటాను యాక్సెస్ చేయలేరు.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్నారు. జర్నీ చేస్తున్నప్పుడో, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడో, ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడో ఠక్కుమని ఫోన్‌తీసి సెల్ఫీలు, ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అయితే ఇలా తీసిన ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ స్టోరేజీలో భద్రంగానే ఉంటున్నాయా? ఇలాంటి సందేహాలకు చెక్ పెట్టాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ సెట్ చేయడం, ప్రవైసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవడం ముఖ్యమంటున్నారు సాంకేతిక నిపుణులు. అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బయోమెట్రిక్, స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్
మీ స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారాన్ని సేఫ్‌గా ఉంచుకోవడానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే.. స్ట్రాంగ్‌పాస్‌వర్డ్ లేదా పాస్‌కోడ్ సెట్ చేసుకోవడం. ఆ ఏముంది లే..! అని కొందరు అందరికీ తెలిసిన పేరునో లేదా 1234 అంటూ ఏదో ఒక సంఖ్యనో పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు. కానీ ఇది సేఫ్ కాదంటున్నారు నిపుణులు అక్షరాలు, అంకెలు, సింబల్స్‌తో కూడిన బలమైన పాస్‌వర్డ్స్ పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
స్క్రీన్‌లాక్ సెట్టింగ్స్
ముఖ్యంగా స్క్రీన్‌లాక్ ఆప్షన్లలో ప్యాటర్న్, పిన్ సెట్టింగ్‌తోపాటు పాస్‌వర్డ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అవసరమైతే ఫేసియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ వంటి బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ ఫీచర్లను సైతం ఆన్ చేసుకోవచ్చు. ఇవి హ్యాకర్లు లేదా ఇతరులు మీ ఫోన్ తీసుకున్నప్పుడు మీ ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా కాపాడుతాయి.
ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్
పాస్‌వర్డ్‌తో పాటు దానికి మరింత సేఫ్టీని జోడించడానికి టూ- ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసిపోయినా, మీ ఫోన్ డేటాను యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే అథెంటిఫికేషన్ కన్‌ఫార్మ్ చేయనిదే లాగిన్ అవ్వడానికి వీలుండదు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ ఓఎస్, యాప్స్‌ను అప్పుడప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ ఆయా బ్రాండ్లు తమ ఫోన్లకు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుంటాయి, కాబట్టి మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లలో ఆటోమేటిక్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. దీంతో సదరు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసినప్పుడల్లా ప్రత్యేకించి మీరు ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. మరొక విషయంట ఏంటంటే.. ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు ఫోన్‌స్టోరేజ్‌లో అంటే గ్యాలరీలో పెట్టుకోవడం కంటే నమ్మకమైన ఎన్‌క్రిప్షన్ రూల్స్ పాటించే క్లౌడ్ స్టోరేజీల్లో ఉంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.






