Don't say sorry : ప్రతిదానికీ SORRY చెప్పకండి.. అది మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది!

by Javid Pasha |

Don't say sorry : ప్రతిదానికీ SORRY చెప్పకండి.. అది మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది!

Dont say sorry : ప్రతిదానికీ SORRY చెప్పకండి.. అది మిమ్మల్ని బలహీనులుగా మార్చేస్తుంది!
X

దిశ, ఫీచర్స్ : మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడో, మనవల్ల అనుకోకండా పొరపాటు జరిగినప్పుడో సాధారణంగా వాడే మాట సారీ. ఈ ఒక్క మాట చాలు ఎదుటి వ్యక్తి కూల్ అయిపోవడానికి. అందుకే అంటారు క్షమించండి (sorry) అనేపదం చాలా పవర్ ఫుల్ అని. వివాద రహిత పరిస్థితని క్రియేట్ చేయడంలో, ఎదుటి వ్యక్తికి మీ పట్ల సానుభూతి కలిగించడంలో సహాయపడేది ఏదైనా ఉందంటే అది సారీనే. ఇక సారీ చెప్పే అలవాటు పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటున్నట్లు కూడా నిపుణులు పేర్కొంటున్నారు. నిజంగా మిస్టేక్ చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పులేదు. కానీ చేయకపోయినా అలవాటు కొద్దీ చెప్పడమనేది మిమ్మల్ని బలహీనులుగా మార్చవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా!

సారీ.. చెప్పడం, చెప్పాల్సి రావడం నిజానికి నామోషీగా ఫీలయ్యే సందర్భం కాదు. పైగా మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం కూడాను. అత్యధిక మంది రోజువారీ అలవాట్లలో ‘sorry’ చెప్పండం కూడా ఒక భాగమైపోయింది. అయితే ఇటీవల ఈ పదంపై నెలకొన్న స్థిరమైన భావనలో మార్పు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. కాలానుగుణంగా ‘సారీ’ పదానికున్న ప్రయారిటీ, ప్రభావం, స్వీకరించే కోణంలో దృక్పథం మారుతున్నాయి. ఆ మార్పు ఏంటంటే.. ‘ప్రతీ దానికి సారీ చెప్పకండి.. మిస్టేక్స్ చేస్తేనే చెప్పండి’ అంటున్నారు నిపుణులు.

సమయం, సందర్భం లేకుండా, తప్పు చేయకున్నా సారీ చెప్పడమంటే ఇతరుల సంతృప్తి కోసం మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మీరే క్రమంగా తగ్గించుకున్నవారవుతారని నిపుణులు అంటున్నారు. పైగా మిస్టేక్ చేయనప్పుడు అలా చెప్పడం అవతలి వ్యక్తిలో ఆధిపత్య భావజాలాన్ని పెంపొందిస్తుందట. ఇది చివరికి మీకు నష్టం చేయవచ్చు. అందుకే ప్రతీ విషయంలో సారీ(sorry) చెప్పడం మీ హాబీ అయితే గనుక ఈసారి చెప్పాల్సి వచ్చినప్పుడు స్వీయ పరిశీలన చేసుకోండి అంటున్నారు కొందరు మానసిక నిపుణులు. మీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, స్వీయ గౌరవాన్ని నెలబెట్టుకోవడంలో ఇదొక భాగమని సూచిస్తున్నారు. మిస్టేక్ చేయనప్పుడు సారీ చెప్పకుండా ఉండటమనేది మీలో స్వీయ అవగాహనను, పర్సనల్ స్ట్రెంత్‌ను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెబుతున్నారు.

Next Story