Black on the neck : మెడపై నలుపు పోవాలంటే..

by Javid Pasha |   (  Updated:2025-02-25 14:39:28  IST  )

Black on the neck : మెడపై నలుపు పోవాలంటే..

Black on the neck : మెడపై నలుపు పోవాలంటే..
X

దిశ, ఫీచర్స్ : మనుషులన్నాక నలుపు, తెలుపు వంటి శారీరక ఛాయను కలిగి ఉండటం సహజమే. దానివల్ల ఎవరూ ఎటువంటి ఇబ్బందీ పడరు. కానీ శరీరమంతా ఒక కలర్‌లో ఉండి, కేవలం మెడపై మాత్రమే నల్లగా ఉండటం మాత్రం అలా ఉన్నవారు కాస్త ఆందోళన నామోషీగా ఫీలవుతుంటారు. కొందరు ఆందోళన చెందుతుంటారు. రోజూ స్నానం చేసినా, రకరకాల సోపులు వాడినా పోవడం లేదని బాధపడుతుంటారు. అయితే వాతావరణ కాలుష్య ప్రభావం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, జెనెటిక్ రీజన్స్, పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా ఇలా మెడపై నల్లగా మారడానికి కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులవల్ల కూడా అలా జరగవచ్చ. అసలు నలుపు ఎందుకు ఏర్పడుతుంది? పరిష్కారమేమిటో ఇప్పుడు చూద్దాం.

* ఇప్పటికీ కొన్ని వ్యాధులు వింతగానే అనిపిస్తాయి. వాటి సింప్టమ్స్ ఏమిటో గుర్తించలేకపోతాం. మెడపై నల్లగా మారడం కూడా కొన్నిసార్లు అలాంటిదే అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ముఖ్యంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే వ్యాధి వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని చెప్తున్నారు. కాగా ఒబేసిటీ, డయాబెటిస్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ వ్యాధులతో బాధపడేవారిలోనే ఈ బ్లాక్ నెక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుంటాయి. ఎందుకంటే ఈ అనారోగ్యాలు కలిగిన వారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంభవిస్తుంది. ఫలితంగా మెడ భాగంలోని స్కిన్‌ లోపలి కణాల్లో పిగ్మెంటేషన్ ఏర్పడి, బయటి చర్మం నల్లగా మారుతుంది. ఎన్ని క్రీములు రాసినా, సోపులు వాడినా ఫలితం ఉండదు. పిగ్మెంటేషన్‌ను మార్చగలిగే చికిత్స ద్వారా మాత్రమే పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అందుకే మెడపై నల్లగా ఉన్నవారు, ఈ సమస్య నుంచి బయటపడాలంటే డెర్మటాలజిస్టులను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ కారణాలవల్ల ఏర్పడే నలుపు ఇంట్లోనే పాటించదగ్గ కొన్నిచిట్కాల ద్వారా పోగొట్టుకోవచ్చు.

*పెరుగు : మెడపై నలుపు పోవడంలో పెరుగు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇక ఎలా వాడాలనే విషయానికి వస్తే కొన్ని చుక్కల నిమ్మరసాన్ని పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడపై రాసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేయడంవల్ల పెరుగు మాయిశ్చరైజర్‌లా పనిచేయడంతోపాటు కొంత కాలానికి చర్మంపై నలుపు తొలగిపోతుందని చిట్కా వైద్యులు చెబుతున్నారు.

* నిమ్మరసం : మరో చిట్కా ఏంటంటే.. ఒక శుభ్రమైన కాటన్ బాల్‌తో మెడచుట్టూ నిమ్మరసాన్ని అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. అయితే నిమ్మరసం అప్లై చేశాక స్కిన్‌పై ఎండ తగలకుండా చూసుకోవాలి. దీంతో నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ అండ్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. మృత కణాలను, జిడ్డును, డస్ట్‌ను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా ఇలా చేస్తూ ఉంటే మెడ నలుపు తగ్గుతుంది.

* కొబ్బరి నూనె : ఇందులో కొన్ని చుక్కల వాటర్ కలిపి, ఈ మిశ్రమంతో మెడపై మర్దన చేసి, వేడినీటితో స్నానం చేయాలి. ఇలాగే బాదం, ఆలివ్ ఆయిల్‌లను కూడా వాడొచ్చు. అట్లనే రోజ్ వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు మెడకు రాసుకోవాలి. ఉదయం కూల్ వాటర్‌తో కడిగితే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. బాదం నూనెను గోరువెచ్చగా వేడి చేసి, దానితో 10 నిమిషాలు మెడపై గల నలుపు భాగంలో మసాజ్ చేసి స్నానం చేయాలి. కొంతకాలానికి నలుపు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story