- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకటికి రెండుసార్లు ముఖం కడుగుతున్నారా..? మీ అందం ఆవిరైపోయినట్టే!
రోజులో ఒకటికంటే ఎక్కువసార్లు సబ్బు లేదా ఫేస్ వాష్‌లతో ముఖం కడిగితే చర్మానికి మేలు చేసే సహజ సిద్ధమైన బ్యాక్టీరియా పూర్తిగా కొట్టుకుపోతుంది. స్కిన్ డల్ , డ్రైగా మారుతుంది.

దిశ, ఫీచర్స్ : ఫ్రెష్‌గా అనిపించాలనో, అందంగా కనిపించాలనో మనం డైలీ రెండు మూడుసార్లు ముఖం కడిగేస్తుంటాం. పైగా సబ్బు పెట్టి నాలుగైదుసార్లు రుద్దీ రుద్దీ వాష్ చేస్తుంటాం. కానీ ఇలా చేయడం చర్మ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్లు, డెర్మటాలజిస్టులు. పైగా అలా చేయడంవల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని అంటున్నారు. రోజుకు ఒక్కసారి కడిగితే సరిపోతుందని, సబ్బు వాడకపోతే ఇంకా మంచిదని చెబుతున్నారు.
నిజానికి చర్మంపై అసినెటోబాక్టర్ (Acinetobacter) అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, యూవీ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అయితే రోజులో ఒకటికంటే ఎక్కువసార్లు సబ్బు లేదా ఫేస్ వాష్‌లతో ముఖం కడిగితే ఈ బ్యాక్టీరియా పూర్తిగా కొట్టుకుపోతుంది. దీనివల్ల చర్మంపై కొల్లాజన్ త్వరగా నాశనమై స్కిన్ డల్ అవడం, ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు రావడం వంటివి సంభవిస్తాయి. కాబట్టి చర్మం మీద ఉండే మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా సమూహం) ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్కసారి మాత్రమే ముఖం కడగాలి అంటున్నారు నిపుణులు. అదికూడా సాధ్యమైతే రాత్రిపూట మాత్రమే కడగాలి. ఉదయానికి కేవలం సాధారణ నీళ్లతో లేదా మైల్డ్ మిసెల్లార్ వాటర్‌తో తుడుచుకోవడమే మేలు.
సబ్బు, ఫేస్‌వాష్, స్క్రబ్, కెమికల్ క్లెన్సర్లు వంటివి ఎక్కువగా వాడితే చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచేందుకు అవసరమయ్యే సహజమైన స్కిన్ లేయర్ నశించిపోతుంది. మంచి బ్యాక్టీరియా కొట్టుకుపోయి చర్మం డ్రైగా మారుతుంది. కాబట్టి యంగ్, గ్లోయింగ్ స్కిన్ కావాలంటే.. రోజుకు ఒక్కసారి మాత్రమే ముఖం కడగడం మెబటర్ అంటున్నారు నిపుణులు. దీంతోపాటు పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 రిచ్ వంటి ఫుడ్స్ తినడం, క్వాలిటీ స్లీప్ వంటివి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






