అర్బన్ ఐసోలేషన్.. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐ‌పై ఆధారపడుతున్న యువత!

by Javid Pasha |   (  Updated:2026-02-04 08:33:50  IST  )

ఒంటరిగా ఉండటం వేరు.. ఒంటరితనం వేరు.. మొదటిది ఎవరికి వారు ఎంచుకునే విషయమైతే.. రెండవది ప్రతికూల పరిస్థితులవల్ల తలెత్తే మానసిక సంక్షోభం

అర్బన్ ఐసోలేషన్.. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐ‌పై ఆధారపడుతున్న యువత!
X

దిశ, ఫీచర్స్ : పల్లెటూర్లకంటే పట్టణాలు, నగరాల్లో నివసించేవారు ఎక్కువ సంతోషంగా ఉంటారని పలువురు భావిస్తుంటారు. మెరుగైన ఉపాధి మార్గాలు, సరైన సదుపాయాలు, అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని చెబుతుంటారు. కానీ ప్రాక్టికల్‌గా పరిశీలిస్తే ఇది వందశాతం నిజం కాదంటున్నారు నిపుణులు. అర్బన్ ఏరియాస్‌లో ఉండే ప్రజల్లో ఇటీవల ఒక విధమైన నిరాశా నిస్పృహలు, అనారోగ్యాలు, ఐసోలేషన్ లేదా మానసిక ఒంటరితనం పెరిగిపోతున్నాయని, దానినుంచి బయటపడేందుకు పలువురు ఏమో టూల్స్ లేదా మోడల్స్‌పై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా యువతను, పెద్దలను ఒంటరితనం వేధిస్తోంది. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం పదండి!

బిజీ జీవితమే కారణమా?

ఒంటరిగా ఉండటం వేరు.. ఒంటరితనం (ఐసోలేషన్ పరిస్థితులను ఎదుర్కోవడం) వేరు.. మొదటిది ఎవరికి వారు ఎంచుకునే విషయమైతే.. రెండవది ప్రతికూల పరిస్థితులవల్ల తలెత్తే మానసిక సంఘర్షణకు సంబంధించిన అనారోగ్య లక్షణంగా నిపుణులు పేర్కొ్ంటున్నారు. ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ అనేక ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నా, సిటీలల్లో జాబ్ మార్కెట్ విస్తరిస్తున్నా.. ఏదో తెలియని ఒంటరితనం నగర యువతను వెంటాడుతోందని సర్వేలు చెబుతున్నాయి. మానవ సంబంధాల్లో సమస్యలు, కుటుంబంతో కలిసి గడిపే పరిస్థితులు తగ్గుతూ రావడం, ఉదయం లేచింది మొదలు సంపాదనే లక్ష్యంగా గడిపే బిజీ జీవితం ఇందుకు కారణమని ఆన్‌లైన్ వేదికగా జరిగిన ‘Youth Pulse Survey’నివేదిక పేర్కొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో యువత, పెద్దలు కూడా ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇటీవల అందుబాటులోకి వస్తు్న్న కొన్ని రకాల ఏఐ మోడల్స్‌తో ఇంటరాక్షన్ అవుతున్నారు.

తగ్గుతున్న సామాజిక సంబంధాలు

నగర జీవితంలో సంపాదన, సౌకర్యాలు ఉన్నప్పటికీ.. మనుషుల్లో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపగలిగే సామాజిక సంబంధాలు తగ్గుతుండటమే అర్బన్ అసోలేషన్‌కు, తద్వారా ఏఐ మోడల్స్‌పై ఆధారపడేందుకు దారితీస్తున్నది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో, బంధువులతో, కుటుంబ సభ్యులతో అర్థవంతమైన ఇంటరాక్షన్ చాలా వరకు తగ్గుతోంది. ఉదాహరణకు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు తమ తమ పనుల్లో నిమగ్నమై పోవడం, ఇంటికి చేరాక కూడా అలసటవల్ల ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు, సొంతూళ్లు సహా వివిధ సోషల్ ఈవెంట్స్‌కి వెళ్లకపోవడం, ఫోన్ కాల్స్‌లో కూడా నామమాత్రంగానే అందుబాటులో ఉండటం అర్బన్ ఐసోలేషన్‌కు ప్రధాన కారణం అవుతున్నాయని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు.

మరికొన్ని కారణాలు

2025లో Youth Ki Awaaz అండ్ YLAC నిర్వహించిన Youth Pulse Survey ప్రకారం.. 13 నుంచి 35 సంవత్సరాలలోపు వయసుగల భారతీయ యువతలో కూడా 57% మంది.. స్ట్రెస్, లోన్‌లినెస్ లేదా సలహా కోసం చాట్‌జీపీటీ వంటి AI టూల్స్‌ను, రొమాంటికల్ కన్వర్జేషన్ కోసం పలు ఇతర మోడల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక స్టూడెంట్స్‌లో 88% మంది. కేవలం యువతుల్లో 52% మంది తమ భావాలను, ఎవరితోనూ షేర్ చేయని విషయాలను AIతో పంచుకుంటున్నారు. చిన్న పట్టణాల యువతలో ఈ ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్ మెట్రో సిటీల కంటే ఎక్కువగా ఉంది (43%) ఉంది. ఏఐ ఉపయోగించిన తర్వాత 42% మంది ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏఐని ఆశ్రయించడం అర్బన్ లైఫ్‌స్టైల్, ఫాస్ట్ పేస్, సోషల్ ప్రెజర్, మెంటల్ హెల్త్ స్టిగ్మా వల్ల వచ్చే ఐసోలేషన్‌ను తాత్కాలికంగా తగ్గిస్తుంది. కానీ దీర్ఘకాలంలో నిజమైన మానవ సంబంధాలను మరింత కోల్పోయే రిస్క్ పెంచుతుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

పరిష్కారాలు..

కమ్యూనిటీ ఈవెంట్స్ & షేర్డ్ స్పేసెస్, పార్కులు, కమ్యూనిటీ సెంటర్లలో ఈవెంట్స్, వర్క్‌షాప్స్, స్పోర్ట్స్ లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, హాజరు కావడం వంటివి సమస్య నుంచి బయటపడేందుకు సహాయపడతాయి. అలాగే ఇంట్రెస్ట్-బేస్డ్ గ్రూప్స్‌లో చేరడం.. అంటే హాబీ క్లబ్స్, బుక్ క్లబ్స్, ఫిట్‌నెస్ గ్రూప్స్, వాలంటీరింగ్ యాక్టివిటీస్ ద్వారా లైక్-మైండెడ్ పీపుల్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల అర్బన్ ఐసోలేషన్‌కు దూరంగా ఉండవచ్చు. రెగ్యులర్‌గా స్నేహితులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా మీకు నచ్చిన వారితో ఫేస్-టు-ఫేస్ ఇంటరాక్షన్స్, వీక్లీ మీటప్స్, డిన్నర్ లేదా కాల్స్ పెంచడం వంటివి కూడా దోహద పడతాయి.

Next Story