- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్&ల్యాప్‌టాప్‌లలో చార్జింగ్ 100% దాటాక ప్లగ్ తీయకపోయినా, అలాగే ఉపయోగించినా నష్టం లేదు!
ఆధునిక ల్యాప్‌టాప్‌లలో చార్జింగ్ 100% దాటాక కూడా ప్లగ్ తీయకుండా వాడినా నష్టం లేదంటున్నారు నిపుణులు

దిశ, ఫీచర్స్ : ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడెన్‌గా షట్‌డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకలా? అంటే.. చాలా మంది చెప్పే సమాధానం.. ‘అయ్యో.. చార్జింగ్ అయిపోయింది.. ప్లగ్ ఆన్‌లో ఉంటే వేడెక్కుతుందని 80% కాగానే తీసేశా. వర్క్‌లో పడి అస్సలు చూసుకోలేదు’ అని. ఇలా చెప్తున్నవారిలో చాలామందికి ఒక విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఏంటంటే.. ఆధునిక ల్యాప్ టాప్‌లకు చార్జింగ్ 100% దాటినా.. పొద్దస్తమానం లేదా వర్క్ అవుతున్నంత సేపు చార్జింగ్ ప్లగ్ తీసివేయకపోయినా.. ఏమీ కాదు.
ల్యాప్‌టాప్‌లో ఇలా..
ఆధునిక ల్యాప్‌టాప్‌లలో చార్జింగ్ 100% దాటాక, ప్లగ్ తీయకపోయినా, కంటిన్యూ వర్క్ చేస్తున్నా అవి వేడెక్కవు. కొంచెం వేడిగా అనిపించినా పేలిపోతాయనే భయం అస్సలు అసవసరం లేదు అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే వీటిలో స్మార్ట్ బ్యాటరీ మేనేజ్ మెంట్ ఉంటుంది. పైగా ఒకసారి 100% చార్జ్ అయ్యాక, ల్యాప్‌టాప్ బ్యాటరీని ఉపయోగించకుండా నేరుగా పవర్ సప్లై నుండే విద్యుత్ తీసుకుంటుంది. అందువల్ల బ్యాటరీ సైకిళ్లు (charge cycles) వృథా కావు. పేలిపోయే చాన్సే లేదు. కాబట్టి పని చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్‌ను ప్లగ్‌లోనే ఉంచడం మంచిది. దీంతో షట్ డౌన్ అయిందని, చార్జింగ్ అయిపోయిందని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
ఫోన్‌లో అయితే..
అయితే ల్యాప్‌టాప్ మాదిరిగానే ఐఫోన్, ఆండ్రాయిడ్ వంటి ఆధునిక స్మార్ట్ ఫోన్‌లలోనూ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలు ఉంటాయి(ఉదా: ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్ లేదా అడాప్టివ్ చార్జింగ్). ఇవి 100% చార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా చార్జింగ్‌ను నియంత్రిస్తాయి. ఓవర్‌ఛార్జింగ్‌ను నిరోధిస్తాయి. కాబట్టి కొన్నిసార్లు చార్జింగ్ పెట్టి మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే.. ఫోన్ చార్జింగ్‌లోనే ఉండగా స్క్రోల్ చేయడం, వీడియోలు, రీల్స్ చూడటం, గేమ్ ఆడటం వంటివి మాత్రం చేయకపోవడం మంచిది అంటున్నారు సాంకేతిక నిపుణులు. దీనివల్ల ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గడం జరుగుతాయి. కాబట్టి ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు రెస్ట్ ఇవ్వడం మంచిది.






