- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mother's Day : మదర్స్ డే వెనుక.. అసలు కథ ఇదే!
1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లో మొదటి మదర్స్ డేను నిర్వహించింది అన్నా జార్విస్. లేఖలు, ప్రచారం ద్వారా దానిని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లింది.

దిశ, ఫీచర్స్ : అమ్మ లాలనలోని వాత్సల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. వేడుకగా జరుపుకునే రోజే మదర్స్ డే. ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం నాడు దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు. తల్లులపట్ల ప్రేమ, గౌరవం, వారి త్యాగాలను గుర్తు చేసుకునే రోజుగా జరుపుకుంటారు. అయితే ఈ మదర్స్ డే అసలు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసా? దీనంటికి ప్రధానకారణం అమెరికాకు చెందిన అన్నా మేరియా జార్విస్ అనే ప్రముఖ సామాజిక కార్యకర్త.
తల్లి మరణంతో..
అన్నా మేరియా జార్విస్ 1864లో జన్మించింది. ఎంతో గారాబంగా పెరిగింది. ఆమె చదువుకోసం, ఆమెను పెంచడం కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. పెద్దయ్యాక అన్నా జార్విస్ కొంతకాలం టీచర్‌గా, కొంతకాలం బ్యాంక్ టెల్లర్‌గా పనిచేసింది. ఆ తర్వాత ఫిలడెల్ఫియాలోని ఓ కంపెనీలో మొదటి మహిళా లిటరీసీ&అడ్వర్టైజింగ్ ఎడిటర్‌గా పనిచేసింది. అయితే ఆమెలో తన తల్లి అన్ రీవ్స్ జార్విస్ మరణంతో(1905) ఒక కొత్త ఆలోచన మొదలయింది. ఏంటంటే.. మదర్స్ డేను క్రియేట్ చేయాలని. ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఆమె తల్లి బతికి ఉన్నప్పుడు ‘తల్లులను గౌరవించే ఒక ప్రత్యేక రోజు ఉండాలి’ అని తరచుగా అంటూ ఉండేదట. తల్లిని కోల్పోయిన బాధలో ఈ మాటలు గుర్తుకు వచ్చి ఎంతో బాధపడేది జార్విన్. ఈ మాటల ప్రభావంతోనే ఆమె తల్లులను గౌరవించే ఒక స్పెషల్ డే కావాలని నిర్ణయించుకొని, ఒంటరిగానే లేఖలు రాయడం, ప్రచారం చేయడం, మీటింగులు ఏర్పాటు చేసి తల్లుల ప్రాముఖ్యతను వెల్లడించడం వంటివి చేసేది. క్రమంగా ఇదొక ఉద్యమంగా కొనసాగించింది.
సెంటిమెంట్ రోజుగా..
1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌లో మొదటి మదర్స్ డే సేవను నిర్వహించింది అన్నా జార్విస్. లేఖలు, ప్రచారం ద్వారా దీనిని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లింది. దీంతో ఆమె సేవలను, ఆలోచనలను గుర్తించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914లో తల్లులను గౌరవించే రోజుగా జరుపుకోవాలని ఒకరోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాడు. అప్పటి నుంచి ఏటా మే రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత మదర్స్ డేను వ్యాపారులు (పువ్వులు, గ్రీటింగ్స్, చాక్లెట్స్) వాణిజ్యపరంగా మార్చడాన్ని కూడా అన్నా జార్విస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఇది సెంటిమెంట్ రోజు లాభాల రోజు కాదు’ అంటూ ఫ్లోరిస్టులు, కార్డు కంపెనీలపై పోరాడింది. మదర్స్ డేను వ్యాపారమయం చేయడాన్ని వ్యతిరేకించే పోరాటంలో ఆమె తన ఆస్తినంతా ఖర్చు చేసి, చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఒంటరిగా మరణిచింది. అందుకే అన్నా జార్విస్ కథ ఒక పాఠంగా మారింది. తల్లిపట్ల ప్రేమ నిజాయితీగా ఉండాలే కానీ, వాణిజ్యంతో ముడిపడి ఉండకూడదనే సందేశాన్ని ఇచ్చింది.






