Dreams : రాత్రిపూట భయంకరమైన కలలు.. తెల్లారితే ఎందుకు గుర్తుండవో తెలుసా?

by Javid Pasha |

Dreams : రాత్రిపూట భయంకరమైన కలలు.. తెల్లారితే ఎందుకు గుర్తుండవో తెలుసా?

Dreams : రాత్రిపూట భయంకరమైన కలలు.. తెల్లారితే ఎందుకు గుర్తుండవో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : రాత్రిళ్లు నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. ప్రతీ ఒక్కరూ ఏదో ఏదో సందర్భంలో, మంచిదో, చెడుదో కలగనే ఉంటారు. అయితే కొన్నిసార్లు భయకంరమైన కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందం కలిగించే కలలు వస్తుంటాయి. కానీ చాలా వరకు భయంకరమైన కలలు తెల్లారేసరికి సరిగ్గా గుర్తుండవు. ఎందుకిలా జరుగుతుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? కానీ ఇది తెలుసుకునే ఉద్దేశంతో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు, మానసిక ఆరోగ్య నిపుణులు పలు కోణాల్లో అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వెల్లడించిన ఆసక్తికర విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం.

*పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మనసులో నాటుకు పోయిన బలమైన భావాలను బట్టి, ఎదుర్కొన్న సంఘటలను బట్టి, వారి ప్రవర్తననుబట్టి కూడా కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఉత్సాహం నింపే కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందాన్ని కలిగించేవి, మరికొన్నిసార్లు భయాన్ని రేకెత్తించేవి వస్తుంటాయి. అయితే వీటిలో గుర్తుండేవి మాత్రం చాలా తక్కువ. వాస్తవానికి రాత్రిళ్లు వచ్చే కలల్లో 99 శాతం వరకు మనకు గుర్తుండవని, భయంకరమైన కలలు అసలు గుర్తుండవని పరిశోధకులు అంటున్నారు. నిద్రపోయినప్పుడు మెదడులో జరిగే కొన్ని రసాయనిక మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు.

*ముఖ్యంగా రాత్రిళ్లు గాఢనిద్రలో ఉన్నప్పుడు కంటి కదలిక సమయంలో నోర్పెనెఫ్రైన్, సెరోటోనిన్, ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు మెదడును ప్రభావితం చేస్తాయి. అవి కలలు వచ్చే సందర్భంలో క్రియారహితం చేయబడతాయని, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడాన్ని కష్టతరం చేస్తాయని, ఈ కారణంవల్లనే కలలు గుర్తుండవని చెబుతున్నారు. అలాగే డ్రీమ్స్ స్వల్పకాలిక మెమోరీ(Short-term memory)లో నిల్వచేయబడే ‘మెమోరీ కన్సాలిడేషన్’ కూడా పరిమిత సామర్థ్యాన్ని, వ్యవధిని కలిగి ఉంటుంది. దీనివల్ల కూడా కలలు గుర్తుండవు.

Next Story