టాక్సిక్ పాజిటివిటీ.. స్వీయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా?

by Javid Pasha |

ఒక వ్యక్తి టాక్సిక్ పాజిటివిటీ బిహేవియర్ వల్ల అవతలి వ్యక్తి నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు.

టాక్సిక్ పాజిటివిటీ.. స్వీయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆలోచనల్లో పాజిటివిటీ ముఖ్యమే. పైగా ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది. అయితే ప్రతీ విషయంలో, ప్రతీ సందర్భంలో పూర్తిగా దీనిపైనే డిపెండ్ అవడం మాత్రం మంచిది కాదంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. అతి సానుకూల ధోరణి కూడా కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితులను, భావోద్వేగాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది. దీనినే టాక్సిక్ పాజిటివిటీ అని కూడా అంటారు.

బలహీనతకు దారితీస్తుందా?

పాజిటివ్ థింకింగ్ అవసరమే. కానీ అన్ని సందర్భాల్లో అది మాత్రమే ముఖ్యం కాదు. దానికి సామాజిక మద్దతు, స్వీయ సమర్థత, పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు తోడైతేనే మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. లేకపోతే అది టాక్సిక్ పాజివిటీగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో ఒక విషయంలో వెనుక బడినప్పుడు టీచర్లో, సంరక్షకులో, మార్గదర్శకులో ఇలా ఎవరో ఒకరు ఎదిగే మార్గం చూపాలి. స్వీయ అనుభవం ద్వారా నేర్చుకునేలా, వాస్తవాలు గుర్తించేలా ప్రోత్సహించాలి. అంతేగానీ అతనికి రాదు కాబట్టి వారే ఆ వ్యక్తి విషయంలో సర్వస్వం అనుకొని సహాయం చేయడం, ప్రతిదానికీ నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం ఎక్కువైతే.. ఈ క్రమంగా ఇది అవతలి వ్యక్తిని బలహీన పరుస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే సానుకూలత కూడా ఎక్కడ, ఎప్పుడు అవసరమనేది గ్రహించాలంటున్నారు నిపుణులు.

అధికమైతే జరిగేది ఇదే..

ఒక వ్యక్తి టాక్సిక్ పాజిటివిటీ బిహేవియర్ వల్ల, అతనిపై ఆధారపడిన లేదా అతని అజమాయిషీలో పనిచేస్తున్న అవతలి వ్యక్తి నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఏదైనా ఒక కేసులో బాధితుల తరపున అధిక సానుకూల పక్షపాతంతో వ్యవహరించే కొందరు టాక్సిక్ పాజివిటీ ధోరణితో ఉంటున్నారు. వీరు సదరు వ్యక్తికి సపోర్టుగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ బాధలను అనుభవించేలా మోటివేట్ చేస్తుంటారు. దీంతో బాధితులు స్వయంగా సమస్యను ఎదుర్కోకుండా అడ్డుపడుతుంటారు. ఇలా.. ప్రతికూల విషయాలను, భావోద్వేగాలను ప్రదర్శించ కూడదనే ఒత్తిడికి గురయ్యే వారు, ఇతరుల సహాయం కోరేందుకు ఇష్టపడకపోవడంవల్ల నష్టపోతుంటారు. అంటే ఇక్కడ అతి సానుకూలత కూడా బలహీనతకు కారణం అవుతుంది. ఇది వారిలో తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది. స్వీయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి టాక్సిక్ పాజిటివిటీని నివారించాలంటున్నారు నిపుణులు.

Next Story