లిప్ స్టిక్స్‌లో హానికర రసాయనాలు.. తరచూ వాడితే రిస్కులో పడ్టట్లే !

by Dishafeatures2 |
లిప్ స్టిక్స్‌లో హానికర రసాయనాలు.. తరచూ వాడితే రిస్కులో పడ్టట్లే !
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం బ్యూటీ ట్రెండ్స్‌‌లో అనేక ఆధునిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడైతే సినిమాల్లో, నాటకాల్లో నటించేవారే మేకప్ వేసుకునేవారట. కానీ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. పండుగలు, ఫంక్షన్ల సందర్భంలోనే కాకుండా, ఇంటి బయట అడుగు పెడితే చాలు. అందంగా రెడీ అవ్వాలనుకునేవారు చాలామందే కనిపిస్తారు. అయితే మేకప్‌లో మహిళలు కామన్ వాడే వాటిలో లిప్ స్టిక్ ఒకటి. ధరించిన దుస్తులకు మ్యాచ్ అయ్యే రంగు రంగుల లిప్ స్టిక్‌లను వాడుతుంటారు చాలామంది. అయితే లిప్ స్టిక్స్‌లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, తరచూ వాడటం ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. ఎలాగో చూద్దాం.

* పెదాలకు లిప్ స్టిక్స్ రాసినప్పుడు అందంగానే అనిపిస్తుండవచ్చు కానీ, వాటిలో ఉండే కార్సినోజెనిక్ అనే హానికారక ప్రాపర్టీస్ వల్ల స్కిన్ డ్యామేజ్, స్కిన్ అలెర్జీలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పెదాలు సహజత్వం కోల్పోయి, నిర్జీవంగా మారుతాయి. పిగ్మెంటేషన్ రావడంవల్ల నల్లగా మారుతాయి.

* లిప్ స్టిక్స్‌ తయారీలో లిక్విడ్ రూపంలో ఉండే లెడ్, వివిధ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు కాబట్టి దీర్ఘకాలంపాటు పెదాలకు రాయడంవల్ల గురక, వివిధ శ్వాసకోశ సమ్యలు, చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువగా వాడటం లేదా అస్సలు వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed