ఫెయిర్‌నెస్ క్రీములతో పెరుగుతున్న రిస్క్..! ఏం జరుగుతుందంటే..

by Javid Pasha |

ఫెయిర్‌నెస్ క్రీముల తయారీలో పాదరసం కంటెంట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

ఫెయిర్‌నెస్ క్రీములతో పెరుగుతున్న రిస్క్..! ఏం జరుగుతుందంటే..
X

దిశ, ఫీచర్స్ : ఉన్నంతలో తాము అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా యువతలో గ్లామర్‌పై ఆసక్తి పెరుగుతోంది. చర్మ నిగారింపును మరింత పెంచుకునే ఉద్దేశంతో పలువురు మార్కెట్లో లభించే రకరకాల ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతుంటారు. అయితే వీటిని దీర్ఘకాలంపాటు వాడటం ప్రమాదకరమని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తరచుగా ఫెయిర్‌నెస్ క్రీములను వాడే వారిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ సహా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నది. సంబంధిత అధ్యయన వివరాలు కిడ్నీ ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్‌లోనూ పబ్లిష్ అయ్యాయి.

నిజానికి ఫెయిర్ నెస్ క్రీములు ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్‌గా ఉంటున్నాయి. వాటిని వాడటంవల్ల చర్మం లేదా ముఖ సౌందర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే వీటి తయారీలో పాదరసం కంటెంట్ ఎక్కువగా ఉపయోగించడంవల్ల ఆరోగ్యంపై, ముఖ్యంగా మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కిడ్నీలు డ్యామేజ్ అయ్యే రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.

2021 నుంచి 2023 మధ్య కాలంలో ఫెయిర్‌నెస్ క్రీములు తరచూ వాడే 22 మందిపై నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. క్రీముల వాడకం వల్ల 68%, అంటే..15 మందికి ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రొటీన్ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. మరికొందరిలో మూత్ర పిండాల భాగంలో వాపు, అలాగే నురుగతో కూడిన మూత్రం రావడం వంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఫెయిర్‌నెస్ క్రీములు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డెర్మటాలజిస్టులను, వైద్య నిపుణులను సంప్రదించి, తమ చర్మానికి సరిపడే వాటిని మాత్రమే ఉపయోగించాలని పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story