లివ్-ఇన్ రిలేషన్‌షిప్ భారతీయ సంస్కృతేనా..? వింతగొల్పే విషయాలివిగో!

by Javid Pasha |   (  Updated:2026-01-23 11:53:56  IST  )

భారత దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోని అటవీ, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నది. వీరి సంస్కృతిలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ చాలా సాధారణం. దీనినే ‘దాపా’ అని పిలుస్తారు.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్ భారతీయ సంస్కృతేనా..? వింతగొల్పే విషయాలివిగో!
X

దిశ, ఫీచర్స్ : ఒక స్త్రీ, ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటేనే భార్యా భర్తలుగా గుర్తిస్తుంది చాలా వరకు మన సమాజం. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలంటే.. ముందు మూడుముళ్ల బంధం పడాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు. పైగా భారతీయ సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన ప్రక్రియ. ట్రెడీషన్ ప్రకారమో, చట్టం ప్రకారమో పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడాన్ని పలువురు వ్యతిరేకిస్తుంటారు. కానీ ఫారెన్ కంట్రీస్‌లో మాత్రం ఇది కామన్. ప్రస్తుతం భారత దేశంలో, ముఖ్యంగా మెట్రో సిటీస్‌లలో కూడా ఈ కల్చర్ బాగానే పెరిగిపోతోంది. దీంతో మన సంస్కృతి, సంప్రదాయం ప్రమాదంలో పడిందని కూడా పలువురు అంటుంటారు. కానీ ఈ కల్చర్ వందలు, వేల సంవత్సరాల క్రితం నుంచే భారత దేశంలోని పలు గిరిజన సమూహాల్లో ఇది కొనసాగుతోందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగానో, వింతగానో అనిపించినా ఇది నిజం. ముఖ్యంగా గరాసియా(Garasia) సమూహంలో దాపా పేరుతో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.

పెళ్లికి ముందే సహజీవనం

గరాసియా అనే గిరిజన సముదాయం భారత దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోని అటవీ, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నది. వీరి సంస్కృతిలో (Live-in relationships) లివ్-ఇన్ రిలేషన్‌షిప్ చాలా సాధారణం. దీనినే ‘దాపా’ అని పిలుస్తారు. శతాబ్దాల కాలంగా ఇది కొనసాగుతూ వస్తోంది. దాపా సంస్కృతి ప్రకారం.. వీరి వైవాహిక బంధం మిగతా సమాజానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో పెళ్లికి ముందే యువతీ యువకులు సహజీవనం చేయడం సాధారణమే కాదు ఆమోద యోగ్యం కూడాను. ఇందుకోసం యువతీ యువకులు వార్షిక మేళాల్లో (Courtship Fair) కలిసినప్పుడు తమకు ఇష్టమైన పార్ట్‌నర్‌ను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వివాహం చేసుకోకుండానే వారిద్దరూ కలిసి నచ్చిన చోటకు వెళ్లి సహజీవనం కొనసాగిస్తారు. పిల్లల్ని కూడా కంటారు. అయితే ఈ సహజీవన సమయంలో బాలుడి కుటుంబం బాలిక కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని అంటే డబ్బు లేదా ధాన్యం వంటివి చెల్లిస్తుంది.

నచ్చితే ఓకే.. నచ్పకపోతే..!

దాపా ప్రకారం.. గరాసియా యువతీ యువకులు లివ్ - ఇన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం, పిల్లల్ని కనడం ఏమాత్రం నిషేధం కాదు. అలా సహజీవనం కొనసాగిన చాలా సంవత్సరాల తర్వాతనే జంటలు పెళ్లిళ్లు చేసుకుంటాయి. అయితే నచ్చకపోతే విడిపోయే హక్కుకూడా వీరి దాపా సంస్కృతిలో ఉంది. అంటే భాగస్వామిని ఎంచుకోవడం, సహజీవనం చేయడం, విడిపోవడం వంటివి నేటి ఆధునిక లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మాదిరిగానే గరాసియా దాపా సంస్కృతిలో ఉంది. ఒక వేళ అసంతృప్తి ఉంటే.. తర్వాత జరిగే మేళాలో విడిపోయి కొత్త భాగస్వామిని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మునుపటి భాగస్వామికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధమైన సంస్కృతి వల్ల గరాసియా గిరిజన సమూహంలో వేధింపులు, అత్యాచారాలు, బలాత్కారాలు వంటివి ఉండవని ఆ సమూహానికి చెందిన వారు చెబుతుంటారు. స్త్రీ వాదులు, నిపుణులు సైతం ఇదే అంటున్నారు. భారతదేశంలోని మిగతా సమాజాలతో పోలిస్తే గరాసియా అనే గిరిజన సమూహం చాలా ప్రగతిశీలంగా కనిపిస్తున్నదని, స్వేచ్ఛ, భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు, స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబించిస్తుందని చెబుతున్నారు.

Next Story