Packaged Snacks : రుచిలో అమోఘం.. ఆరోగ్యానికే ప్రమాదం.. ప్యాకేజ్డ్ స్నాక్స్‌తో రిస్క్ తప్పదంటున్న నిపుణులు

by Javid Pasha |

ప్యాకేజ్డ్ స్నాక్స్ లేదా ఆహార పదార్థాల్లో యూజ్ చేసే కెమికల్ ఎక్స్‌పోజర్స్ వల్ల పిల్లల్లో, ముఖ్యంగా బాలికల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Packaged Snacks : రుచిలో అమోఘం.. ఆరోగ్యానికే ప్రమాదం.. ప్యాకేజ్డ్ స్నాక్స్‌తో రిస్క్ తప్పదంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదా.. కాదా? అనేదానికంటే.. టేస్టీగా ఉన్నాయా.. లేదా? అనే దానిని బట్టే స్నాక్స్‌కు ప్రయారిటీ ఇస్తుంటారు. రుచిగా ఉంటే చాలు ఏమాత్రం ఆలోచించకుండా లాగేస్తుంటాం. ముఖ్యంగా చిప్స్, కుర్ కురే, బిస్కెట్లు, చాక్లెట్లు, నమ్కీన్ వంటివి సహా పలు రకాల స్నాక్స్ ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లలో ప్యాకేజ్డ్ ఫుడ్స్‌గానే లభిస్తుంటాయి. నిజానికివి రుచిలో అమోఘం.. కానీ తరచుగా తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు పోషకాహార నిపుణులు. అధ్యయనాలు సైతం అదే చెబుతున్నాయి.

ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు ప్యాకేజ్డ్ స్నాక్స్ లేదా ఆహార పదార్థాల్లో యూజ్ చేసే కెమికల్ ఎక్స్‌పోజర్స్ వల్ల పిల్లల్లో, ముఖ్యంగా బాలికల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు మొత్తం 824 మంది బాలికలు, మహిళలకు సంబంధించిన హెల్త్‌ రిపోర్టులను ఎనలైజ్ చేయగా, వీరిలో హెయిర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్‌మెంట్ సహా.. అన్ని యవ్వనదశ లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఓవరాల్‌గా 24 శాతం మంది బాలికల్లో ప్యాకేజ్డ్ స్నాక్స్ లేదా ఫుడ్స్‌లోని ఫరెవర్ కెమికల్స్‌కు బహిర్గతం కావడంవల్ల తర్వాతి దశలో రుతుక్రమ సమస్యలు ఏర్పడ్డాయని, 42 శాతం మంది మహిళల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగాయని గుర్తించారు. అందుకే తరచుగా ప్యాకేజ్డ్ స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు.

Next Story