- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ మాటలు ఫోన్ వింటుంది.. ఆల్గారిథమ్‌లకు లీక్ అవుతాయ్..!?
మొబైల్ ఫోన్ మీ మాటలను వింటుంది. ఆల్గారిథమ్‌లకు చేరవేస్తుంది. అందుకే ఆ అంశాలకు సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షం అవుతుంటాయి.

దిశ, ఫీచర్స్ : అవి ప్రమాదకరమేమీ కాకపోవచ్చు, అందులో రహస్యమేమీ లేకపోవచ్చు.. కానీ మన మాటలు, మన ఆలోచనలు మన సొంతం. ప్రతీ వ్యక్తి తాను మాట్లాడుతున్న వ్యక్తికి మాత్రమే లేదా అక్కడున్న సమూహానికి మాత్రమే తప్ప ఎవరికీ తెలియకూడదు అనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ ఈ రోజుల్లో అలా పెద్దగా లాభం లేదండోయ్.. ఎదుకంటే.. మీరు మాట్లాడుకునే మాటలు, ఆలోచనలు ఏదో ఒక విధంగా లీక్ అవుతాయి. అందుకు సంబంధిన ఆచరణ రూపమో, అక్షర రూపమో ఎక్కడో ఒక దగ్గర దర్శనమిస్తుంది. ముఖ్యంగా మీ ఆలోచనలకు అనుగుణమైన కంటెంట్ సోషల్ మీడియాలో వేదికల్లోనో, గూగుల్లోనో ప్రత్యక్షం అవుతూ మనల్ని ఆకర్షిస్తుంది. అదెలా సాధ్యం? సింపుల్.. ఇక్కడ చెవులు గోడలకు కాదు.. మీ జేబులో ఉండే స్మార్ట్ ఫోన్‌కు ఉంటాయ్..!
అనుకున్నది లేదనుకునేరు!
నమ్మాలనిపించకపోవచ్చు.. కానీ నిజం. మీరు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. దానికి సంబంధించిన సమాచారం కోసం మొబైల్ ఫోన్‌లోనో, డెస్క్ టాప్‌లోనో సెర్చ్ చేస్తారు. ఉంటే ప్రత్యక్షం అవుతుంది. లేని సబ్జెక్టయితే దొరకదు. ఇక దొరకదేమోనని మీరు ఫిక్స్ అవుతారు. కానీ మరో గంట తర్వాతో, మరుసటి రోజో మాత్రం ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంటో, వీడియోలో, సమాచారమో గూగుల్‌లో కనిపిస్తూ ఉంటుంది. సోసల్ మీడియాలో వేదికల్లో దర్శనమిస్తూ ఉంటుంది. వివిధ యాప్‌లను ఓపెన్ చేసినప్పుడు సంబంధిత లింక్స్, యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా మీరెప్పుడైనా గమనించారా?.. ప్రతీ విషయంలో జరగకపోవచ్చునేమో కానీ.. చాలా విషయాల్లో ఇది జరుగుతుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే.. మీ ఆలోచనలు, మీ మాటలు, మీరు వాడే మొబైల్ ఫోన్ ద్వారానో, అందులోని యాప్‌ల ద్వారానో గూగుల్ వంటి టెక్ దిగ్గజాల ఆల్గారిథమ్‌లకు చేరుతాయి. కానీ ఇలా జరుగుతుందని ఎవరూ చెప్పరు. చాలామంది నమ్మరు.. సదరు టెక్ సంస్థలు, మేనేజ్‌మెంట్లు అడిగినా ఖండిస్తారు. కానీ వాస్తవం ఏమిటో మీరే అర్థం చేసుకోండి.
ఆ రహస్యం.. ఆల్గారిథమ్‌లకు
ఫలానా డిజైనర్ డ్రెస్ కావాలనో, ఫలానా బ్రాండ్ షూ కావాలనో, ఆ కంపెనీకి చెందిన మొబైల్ బాగుంటుందనో మీరు మాట్లాడుకుంటారు. ఫలానా వస్తువు ఎక్కడ దొరుకుతుందో, ఫలానా సంస్కృతి ఏ దేశంలో ఉందో తెలియదని చర్చించుకుంటారు. కానీ వాటన్నింటికీ సమాధానం మరుసటి రోజు లేదా కొన్నిరోజుల తర్వాత గూగుల్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా వేదికల్లో దర్శనమిస్తుంది. కావాలంటే స్వైప్ చేసి చూడండి. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువే మీ ఆలోచనలకు అనుగుణమైన కంటెంట్ దాదాపు తర్వాతనైనా లభిస్తుంది. కారణం మీ మొబైల్ ఫోన్ మీ మాటలను వింటుంది. ఆల్గారిథమ్‌లకు చేరవేస్తుంది. అందుకే ఆ అంశాలకు సంబంధించిన ప్రకటనలు త్వరలోనే వచ్చేస్తాయి. నిజమే టెక్ దిగ్గజాలు “వినడం లేదు’’.. కానీ పేటెంట్లు, అలాగే టెక్ విసిల్‌బ్లోవర్లు(Patents, and well as whistleblowers) మరో కథను చెబుతున్నాయి. ఏంటంటే.. మీ మాటలు, ఆలోచనలు లీక్ అవుతాయ్.. అని!!
ఇదిగో వాస్తవం..!
2018లో అమెజాన్ వాయిస్-స్నిఫింగ్ అల్గారిథమ్‌కు పేటెంట్ పొందింది. ఫేస్‌బుక్ 2016లో ఆడియో-ట్రిగ్గర్ టెక్‌ను ఫైల్ చేసింది. 2014లో గూగుల్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ అనాలిసిస్‌కు పేటెంట్ పొందింది. తర్వాత 2019లో బ్లూమ్‌బెర్గ్, ది గార్డియన్, యాపిల్(Apple) స్వయంగా అంగీకరించినట్లు, కాంట్రాక్టర్లు ‘క్వాలిటీ చెక్స్’ కోసం యూజర్ ఆడియో రికార్డింగ్‌లను విన్నారు. సో.. దీనిని బట్టి మీ ఆలోచనలు లీక్ అవుతాయ్ అని నమ్మొచ్చ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అందుకోసం మీ మైక్రోఫోన్ అనుమతి ఉన్న యాప్‌లు పూర్తి సంభాషణల(Complete conversations)ను రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు పెద్దగా అవసరం లేదు. అవి సెర్చ్ ఇంజిన్లలో కీవర్డ్స్ అండ్ నమూనాల(Identify patterns)ను గుర్తించి ప్రకటనల(ads)ను పర్సనలైజ్ చేస్తాయగలవని సాంకేతిక నిపుణులు, పరిశీలకులు అంటున్నారు.
నో డౌట్.. ఆశ్చర్యపోక తప్పదు..
అందుకే.. చాలా మంది యూజర్లు ఒక ప్రొడక్ట్ గురించి బిగ్గరగా మాట్లాడిన తర్వాత టార్గెటెడ్ ప్రకటనలు (ads) సోషల్ మీడియాలో, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో ప్రత్యక్షం అవడం చూసి ఆశ్చర్యపోతుంటారు. నో డౌట్.. మన మాటలు మన ఫోన్లు, వాటిలోని యాప్‌లు వింటాయి. లేదా సెర్చ్ ఇంజిన్లు కీ వర్డ్స్‌ను బట్టి మన ఆలోచనలను, ఆసక్తులను ప్రదర్శిస్తాయి. ఇది మంచిదే. కానీ మరీ వ్యక్తిగత విషయాల్లో అయితే బాగోదు కదా.. అందుకోసం చక్కటి పరిష్కారం మీ వద్దే ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో మైక్ పర్మిషన్స్ (Turn off mic permissions) ఆఫ్ చేయండి. ‘హే సిరి’ అండ్ ‘ఓకే గూగుల్’లను డిసేబుల్ చేయండి. దట్సాల్. Link






