Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!

by Javid Pasha |

Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!

Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. ఇది బాధిత వ్యక్తుల జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనారోగ్యాలకు కారణం అవుతోంది. స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి కూడా దీంతో ముడిపడి ఉన్నందున అధిక బరువు లేదా ఊబకాయం సమస్యను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు బాధితులు. జిమ్‌లో కసరత్తులకోసం వేలల్లో ఖర్చు పెడుతుంటారు. అయితే అంత రిస్క్ లేకుండానే ఈ సమస్యను దూరం చేసుకునే అద్భుతమైన ట్రిక్ ఒకటి ఉందంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అదే స్కిూప్పింగ్.

*నిపుణుల ప్రకారం.. స్కిప్పింగ్ (Rope jumping) కూడా అధిక బరువును తగ్గించే అత్యంత ప్రభావవంతమైన కార్డియో వ్యాయామాలలో ఒకటి. ఎందుకంటే ఇది గంటకు 600-1000 కేలరీలను బర్న్ చేయగలదు. కాబట్టి బరువు తగ్గాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా రోజూ స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు. అయితే శరీర బరువు, వ్యాయామ తీవ్రత, స్కిప్పింగ్ చేసే సమయాన్ని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

*స్కిప్పింగ్ శరీరానికి మంచి వ్యాయామమే కాకుండా హార్ట్‌రేట్‌ను పెంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని దాదాపు అన్ని కండరాలను, ముఖ్యంగా కాళ్లు, చేతులు, భుజాలు, కోర్ కండరాలను బలంగా మార్చడంతోపాటు కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. బాడీ బ్యాలెన్సింగ్‌కు, రక్తప్రసరణలో మెరుగుదలకు ప్రేరణగా నిలుస్తుంది. అందుకే రోజూ 10 నుంచి 20 నిమిషాలు స్కిప్పింగ్ చేయడంవల్ల 8 వారాలలో శరీరంలో కొవ్వుశాతం చాలా వరకు తగ్గిపోయి అధిక బరువు తగ్గుతారు. స్కిప్పింగ్‌తోపాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గుడ్డు తెల్లసొన, చికెన్, చేపలు, గింజలు, అవకాడో వంటివి డైట్‌లో చేర్చుకొని మితంగా తింటూ ఉండాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story