- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముప్పై ఏళ్లకే ఎముకల బలహీనత.. ఇలా చేస్తే బెటర్!
ఎముకల బలానికి విటమిన్ D సమృద్ధిగా ఉండే ఆహారం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు నడీడు వయసు దాటిర తర్వాత ఎముకల బలహీనత, పెళుసుగా మారడం, పగుళ్లు(Bone Density) రావడం వంటి సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు 30 ఏండ్ల వయసులోనే పలువురు యువతీ యువకులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నదని నివేదికలు పేర్కొంటున్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఇందుకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్రాముఖ్యత
ఎముకలను బలోపేతం చేయడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి బరువులు ఎత్తడం, బాడీ వెయిట్ ఎక్సర్‌సైజెస్ వంటి రెగ్యులర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా అవసరమని, ఇది ఎముకల బలానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎముకలపై ఆరోగ్యకరమైన ఒత్తిడి (healthy stress) పెరిగి ఎముకలు బలపడతాయి. కొత్త ఎముక కణాలు ఏర్పడతాయి. వారానికి 2-3 రోజులు రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజెస్ చేయడం ఎముకల సాంద్రత(Bone Density)ను మేనేజ్ చేయడంలో చాలా సహాయపడుతుంది.
పోషకాహారం, జీవనశైలి
ఎముకల బలానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా, కాల్షియం, విటమిన్ D సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు, పెరుగు, ఆకు కూరలు, చేపలు, గుడ్లు, రోజూ కాసేపు ఉదయపు ఎండలో గడపడం ద్వారా ఇవి లభిస్తాయి. అలాగే రెగ్యులర్ వాకింగ్, రన్నింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ, ధూమపానం మానేయడం, మితంగా మద్యం సేవించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఎముకల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడతాయి. మొత్తానికి ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండాలంటే వ్యాయామం, సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు.. ఈ మూడింటినీ తప్పక అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






