మోడెస్ట్ దుస్తులు.. ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ విలువను పెంచుతాయా?

by Javid Pasha |

నిరాడంబరమైన దుస్తుల ధరించడం ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ విలువను పెంచుతాయని 74% మంది మహిళలు అంగీకరిస్తున్నారు

మోడెస్ట్ దుస్తులు.. ఆత్మ విశ్వాసాన్ని, స్వీయ విలువను పెంచుతాయా?
X

దిశ, ఫీచర్స్ : ధరించే దుస్తుల్ని బట్టి కూడా ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అంటుంటారు పెద్దలు. వందశాతం కరెక్ట్ కాకపోయినా కొంతవరకు నిజమేనని కూడా మానసిక నిపుణులు చెబుతుంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హుందాతనాన్ని, ఆత్మభిమానాన్ని, స్వీయ విలువను కూడా ప్రతిబింబిస్తుంది. సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. అందుకే కాబోలు కార్పొరేట్ సంస్థల్లో, విద్యా సంస్థల్లో డ్రెస్సింగ్ కోడ్స్ అమలు చేస్తుంటారు. ఇటీవల ఒక మోడెస్ట్ వేర్ బ్రాండ్ నిర్వహించిన సర్వే కూడా దాదాపు అదే వెల్లడించింది. నిరాడంబరమైన దుస్తులు ధరించే మహిళలు అధిక ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారని తెలిపింది. ఇది స్త్రీ, పురుషులందరికీ, ముఖ్యంగా యువతీ యువకులకు కూడా వర్తిస్తుందని మరో అధ్యయనం పేర్కొన్నది.

లాంగ్ మాక్సీ డ్రెస్సులు, లాంగ్ స్లీవ్స్ టాప్స్+ స్కర్ట్స్/ప్యాంట్స్, శారీల విషయానికి వస్తే.. ప్రాపర్ కవరేజ్‌తో కూడిన బ్రైడల్ చీరలు, అలాగే మాక్సీ గౌన్స్, లాంగ్ స్లీవ్ టాప్స్ + లాంగ్ స్కర్ట్స్, డ్రెస్ ఓవర్ ప్యాంట్స్ వంటివి ధరించడం మహిళల్లో హుందాతనాన్ని ప్రతిబింబిస్తాయని, చూడగానే ఆకట్టుకుంటాయని నిపుణులు అంటున్నారు. చాలామంది మహిళలు కూడా మంచి వ్యక్తిత్వానికి, సత్ప్రవర్తనకు నిదర్శనంగా, స్వీయ విలువ, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా ఈ విధమైన దుస్తులను అభివర్ణిస్తుంటారు. అధ్యయనంలో భాగంగా నిపుణులు పలువురిని ప్రశ్నించినప్పుడు కూడా ఇదే వెల్లడైంది.

నిరాడంబరమైన దుస్తులను ధరించడం తమలో ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, తమపై తమకు నమ్మకాన్ని కలిగించిన భావనకు గురిచేస్తాయని 74% మంది మహిళలు పేర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక 66% మంది సరసమైన, చిక్ మోడెస్ట్ ఔట్‌ఫిట్స్‌ను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి దుస్తులు ధరించడంలో నిరాడంబరత అనేది హుందాతనానికి, ఆత్మ గౌరవానికి, స్వీయ విలువలకు ప్రతీకగా నిలుస్తున్నదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ భావన అందరిలోనూ, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పలేం అంటున్నారు నిపుణులు. కాలానుగుణంగా డ్రైస్సింగ్ స్టైల్స్, అభిప్రాయాల్లో మార్పులు సంభవిస్తుంటాయి. పైగా వ్యక్తిగత ఎంపికలు ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

Next Story