- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ ఎఫెక్ట్.. వేడి వాతావరణంతో తలెత్తుతున్న ఆ సమస్యలు..!
సమ్మర్‌లో తల తిరగడం, తీవ్రమైన అలసట, వాంతులు విరేచనాలు వంటి సింప్టమ్స్ కనిపిస్తే, అవి డీహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు.

దిశ, ఫీచర్స్ : వేసవి అంటేనే మనకు ఠక్కున గుర్తొచ్చేది భగ భగ మండే ఎండలు. ప్రస్తుతం అదే నడుస్తోంది. ఉదయం 7 దాటితే చాలు ఎండలు మండుతున్నాయి. వివిధ పనుల మీద బయటకు వెళ్లేవారు వేడిగాలులు, ఉక్కబోతలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికీ వెళ్లకపోయినా, ఇంట్లో ఉంటున్నవారు సైతం వాతావరణ మార్పులతో అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇక ఎండలో పనిచేసేవారు, ప్రయాణాలు చేసేవారు ఈ సీజన్‌లో డీహైడ్రేషన్ బారినపడే అవకాశం కూడా ఉంటుందని, చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలా జరగకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా సమ్మర్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇక తల తిరగడం, తీవ్రమైన అలసట, వాంతులు విరేచనాలు వంటి సింప్టమ్స్ కనిపిస్తే అవి డీహైడ్రేషన్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా వస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు, దురద, కాలిపోయినట్లు మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కొందరిలో అధికం అవుతుంటాయి. ఇలాంటప్పుడు చర్మాన్ని రక్షించుకోవాలంటే బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్ వంటివి అప్లయ్ చేయడం, ఎండ ప్రభావం నేరుగా పడకుండా గొడుగు వాడటం, కాటన్ దుస్తులు ధరించడం వంటివి చేయాలంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. దీంతోపాటు పొట్టలో ఉబ్బరం, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణ ధాన్యాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






