పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తున్న నీటి శబ్దాలు.. కార్టిసాల్ స్థాయిలు తగ్గించడంలోనూ కీ రోల్..!

by Javid Pasha |   (  Updated:2025-08-19 07:55:16  IST  )

నీటి దృశ్యం, శబ్దం మీ శరీరంలోని ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ‘బ్లూ మైండ్’ అనే ప్రశాంత మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది.

పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తున్న నీటి శబ్దాలు.. కార్టిసాల్ స్థాయిలు తగ్గించడంలోనూ కీ రోల్..!
X

దిశ, ఫీచర్స్ : చెరువు గట్టుపై కూర్చొని నీటిలోకి తొంగి చూస్తే మీకేమనిపిస్తుంది? గల గల పారుతున్న వాగు చప్పుళ్ల శబ్దం వింటే మీరెలా ఫీలవుతారు? ఎత్తైన కొండల నుంచి కిందకు దుంకుతన్న జలపాతం చూసినప్పుడు మీరెలా భావిస్తారు? ఆ అందమైన దృశ్యాలు కనువిందు చేస్తుంటే.. మనసు ఆనందంతో పొంగిపోతుంది కదూ! ఆ నీటి ప్రవాహాల చప్పుళ్లు శ్రావ్యమైన సంగీతంలా మనసును హత్తుకుంటాయి కదూ..! సరిగ్గా ఈ పరిస్థితే మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని, పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా చూడటమే కాదు, అటువంటి దృశ్యాన్ని ఊహించుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇది కేవలం ఊహ కాదు.. నిరూపితమైన శాస్త్రీయ వాస్తవమని కూడా నిపుణులు అంటున్నారు.

పారుతున్న వాగు, ప్రశాంతమైన చెరువు, నది లేదా ఫౌంటైన్ ఏదైనా సరే అక్కడ కాసేపు కూర్చోవడం వల్ల కలిగే ఆనందం మీలో రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆ సందర్భంలో నీటి దృశ్యం, శబ్దం మీ శరీరంలోని ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ‘బ్లూ మైండ్’ అనే ప్రశాంత మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది. దీంతో ఆందోళన తగ్గి, ఆనందం మీ మనసుపై ఆధిపత్యం చలాయిస్తుంది. దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అది ఏకాగ్రతను పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మొత్తానికి మీ మానసిక ఆరోగ్య శ్రేయస్సుకు దోహద పడుతుంది. అందుకే వాగులు, వంకలు, చెరువులు, నదులు, జలపాతాలు వంటి జలాశయాల నీటి ప్రవాహానలు, వాటి శబ్దాలను ఆస్వాదించే అవకాశం వస్తే ఏమాత్రం మిస్ చేసుకోకండి అంటున్నారు నిపుణులు. Link

Next Story