- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yoga Day : వామ్మో.. జల యోగాతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే చేయకుండా ఉండలేరు!
Yoga Day : వామ్మో.. జల యోగాతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే చేయకుండా ఉండలేరు!

దిశ, ఫీచర్స్ : యోగా ఆనందాన్నిస్తుందని, మానసిక వికాసాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యానికి మేలు అద్భుతమైన వ్యాయామాల్లో ఇది కూడా ఒకటి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘‘Yoga for One Earth, One Health’’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు యోగా గురించి, దాని ప్రయోజనాల గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో సైతం పలు రకాల యోగాసనాలు ఉన్నాయి. అలాంటి వాటిలో జలయోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జల యోగా (Water yoga) అనేది నీటిలో తేలియాడుతూ చేసే ఒక ప్రత్యేకమైన భంగిమ రూపం. ఇది శారీరక వ్యాయామం(physical exercise), మెడిటేషన్, శ్వాస నియంత్రణ(Breath control)లను సైతం మిళితం చేస్తుంది. సాధారణంగా వాటర్ యోగాను గ్రామాల్లో అయితే బావులు, చెరువుల్లో ప్రాక్టీస్ చేస్తారు. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్స్‌లలో కూడా ఈ యోగాసనాన్ని వేస్తున్నారు. శ్వాస నియమాలు పాటిస్తూ నీటిలో తేలియాడే భంగిమ స్వభావం కారణంగా జల యోగా కీళ్లు, కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కండరాల సాగదీతను, సౌలభ్యాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రక్త ప్రసరణను, హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది. దీంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.






