- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌సోమ్నియా= ఇన్‌ఫెర్టిలిటీ.!
అసలీ నిద్రలేమి నేటితరాన్ని ఎలా వేధిస్తుందో తెలుసుకుందాం.

కొందరు తిన్న ఐదు నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు.
కొందరికేమో.. ఎంత ప్రయత్నించినా అసలు నిద్రేరాదు.
మారిన జీవనశైలే దీనికి కారణం.
ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు.
మహిళలల్లో అయితే సంతాన సమస్యలు తీవ్రమవుతున్నాయి.
అసలీ నిద్రలేమి నేటితరాన్ని ఎలా వేధిస్తుందో తెలుసుకుందాం.
అసలేంటీ నిద్రలేమి.?
- దిశ, ఫీచర్స్
నిద్రలేమి అనేది ఒక్కోసారి నిద్రపోలేని రాత్రులకంటే ఎక్కువ. వారంలో కనీసం మూడు రోజులు.. మూడు నెలల పాటు నిద్రపోవడంలో కలిగే ఇబ్బందిని నిద్రలేమిగా భావిస్తారు. నిద్ర పట్టకపోవడం లేదా త్వరగా మెలకువ రావడం.. రోజంతా అలసట లేదా పనితీరు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యను ఇన్‌సోమ్నియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా 15% మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. మహిళలే ఈ జాబితాలో ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
సంతానోత్పత్తిపై ప్రభావం
కొందరు ఎంతో ప్రయత్నిస్తారు. కానీ సంతాన సాఫల్యం కాదు. దానికి కారణం నిద్రలేమి కూడా కావచ్చు. హార్మోన్లు.. పోషకాహారం.. వయసు.. ఒత్తిడి వంటి ఎన్నో అంశాలు దీనికి కారణం అవుతాయని మనకు తెలుసు. కానీ వాటన్నింటికంటే ఇప్పుడు నిద్రలేమి సమస్య కారణం అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. నిద్రలేమి అంటే ఇన్‌సోమ్నియా. నిద్ర శరీరానికి చాలా అవసరం. మనసుకు కూడా. నిద్రలో లోపం ఉంటే హార్మోనల్ సమస్యలు వస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. వీటి ప్రభావం వల్ల సంతానోత్పత్తి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఏం చేస్తుంది.?
నిద్రలేమి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్.. యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యలతను సృష్టిస్తుంది. ఇది అండాలు.. స్పెర్మ్‌లపై హాని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి ఆక్సిడేటివ్ డ్యామేజ్‌కు అత్యంత సున్నితమైనవి. నిద్రలేమితో బాధపడేవారిలో గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ వంటి యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది సంతానోత్పత్తి కణాల రక్షణను కష్టతరం చేస్తుంది.
ప్రతికూల ప్రభావం
నిద్రను BMAL1, CLOCK, CRY1, PER1, PER2 వంటి క్లాక్ జీన్స్ నియంత్రిస్తాయి. హైపోథాలమస్‌లోని సూపర్ చియాస్మాటిక్ న్యూక్లియస్‌లో ఈ జీన్స్ వ్యక్తీకరణ హార్మోనల్ రిథంలు.. స్పెర్మ్ ఆరోగ్యం.. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సంబంధించి ఉంటుంది. ఈ జీన్స్ వ్యక్తీకరణలో మార్పులు స్పెర్మ్ చలనశీల.. టెస్టోస్టీరాన్ స్థాయిలకు తగ్గుదలకు దారితీసి సంతానోత్పత్తికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
హార్మోన్ల అసమతుల్యత
నిద్రలేమి మెలటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మెలటోనిన్ నిద్రకు సహాయపడటమే కాక.. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా.. హైపోథాలమిక్.. పిట్యూటరీ ఆడ్రినల్ అక్షాన్ని నియంత్రిస్తుంది. మెలటోనిన్ తగ్గి.. కార్టిసాల్ పెరగడం వల్ల టెస్టోస్టెరాన్.. ఈస్ట్రాడియల్ వంటి సంతానోత్పత్తి హార్మోన్ల సమతుల్యలత భంగం అవుతుంది. ఫలితంగా సంతాన సామర్థ్యం తగ్గుతుంది.
ఏం చేయాలి.?
ఆరోగ్యమైన జీవనం.. సంతానోత్పత్తి కోసం రాత్రి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. కాబట్టీ సంతానలేమికి గల కారణాలను తెలుసుకోవడంలో నిద్ర ఒక కీలక అంశం అని గ్రహించాలి. నిపుణులైన డాక్టర్ల సలహాతో నిద్ర.. హార్మోనల్ సపోర్ట్ చికిత్స తీసుకోవాలి. దీనివల్ల శరీరం.. భవిష్యత్ కుటుంబ ఆరోగ్యమూ బాగుండే అవకాశాలున్నాయి.






