Technology : రోగులకు మందులు రాస్తున్న రోబోలు.. భవిష్యత్తులో ఫార్మసిస్టుల పాత్రను ఫుల్‌ఫిల్ చేస్తాయా?

by Javid Pasha |   (  Updated:2025-05-27 06:33:40  IST  )

Technology : రోగులకు మందులు రాస్తున్న రోబోలు..! భవిష్యత్తులో ఫార్మసిస్టుల పాత్రను ఫుల్‌ఫిల్ చేస్తాయా?

Technology : రోగులకు మందులు రాస్తున్న రోబోలు.. భవిష్యత్తులో ఫార్మసిస్టుల పాత్రను ఫుల్‌ఫిల్ చేస్తాయా?
X

దిశ, ఫీచర్స్ : రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అనేక విషయాల్లో పనులు సులభతరం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏఐ ఆధారిత హ్యూమనాయోడ్ రోబోట్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. వందలాది మంది నెలలు, సంవత్సరాల తరబడి చేయాల్సిన పనులను సైతం కేవలం రోజుల్లోనే పూర్తి చేయడంలో ఇవి సహాయపడుతున్నాయి. ఇండస్ట్రీయల్ సెక్టార్ మొదలు మెడికల్ అండ్ హెల్త్ వరకు ఇప్పటికే ఏఐ రోబోలు పలు విషయాల్లో ఆసరాగా నిలుస్తున్నాయి. బ్లడ్ టెస్టుల నిర్వహణలో, రిపోర్టులు త్వరగా అందించడంలో వైద్య నిపుణులకు సహాయపడుతున్నాయి.

ఇటీవల వాల్ గ్రీన్‌ఫార్మసీ ఆటోమేషన్ యుగంలోకి అడుగుపెట్టి, ఈ ప్రాసెస్ ద్వారా $500 మిలియన్ల(రూ. 50 కోట్లు)కు పైగా ఆదా చేయడం సంచనలంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది రోబోటిక్ ప్రిస్క్రిప్షన్(Robotic prescription) ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను అమలు చేస్తూ, రోబోట్స్ ద్వారా మందులను క్రమబద్ధీకరించడం(Sorting medications), ప్యాకేజ్ చేయడం, డెలివరీ చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫార్మసీ రంగంలో హ్యూమనాయిడ్ రోబోటిక్ సేవల గురించి కొత్త ఆశలు చిగురిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఫార్మాసీ రంగంలో ఏఐ ఆధారిత అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలు రోజుకు వేలాది ప్రిస్క్రిప్షన్‌లను చాలా వేగంగా, దాదాపు పూర్తి కచ్చితత్వంతో(With extraordinary speed and almost perfect accuracy) ప్రాసెస్ చేయగలవని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ప్రిస్క్రిప్షన్‌లు రాసేందుకు రోబోల సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్లు, రోగులు, వైద్య సిబ్బంది మెడికేషన్ ఎనలైజింగ్, సేకరణ, నిర్వహణ కోసం స్టోర్‌లో గంటల తరబడి వేచి ఉండే సమయం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఫార్మసిస్టుల ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందనే ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నప్పటికీ, అలాంటిదేం జరగదని, ఫార్మసిస్టులు పూర్తిగా రోగుల సంరక్షణ, ఇతర అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా వైద్య ఆరోగ్య రంగాలు మరిన్ని కొత్త ఆవిష్కరణలను క్రియేట్ చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story