- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : గోడలు మాట్లాడుతాయ్.. ఫ్రిడ్జ్ ఆరోగ్యం చూస్తుంది..! ఇంటెలిజెంట్ హోమ్ భవిష్యత్ రియాలిటీ ఇదే..!!
భవిష్యత్ గృహాలు సాధారణ స్మార్ట్ హోమ్‌లకు మించి, ఇంటెలిజెంట్ సిస్టమ్‌లుగా మారుతున్నాయి. ఇక్కడ గోడలు, కిటికీలు, వివిధ ఉపకరణాలు, ఎనర్జీ నెట్‌వర్క్‌లు కలిసి పనిచేయగల సాంకేతికత గృహ నిర్మాణంలో అంతర్భాగం కావచ్చు.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డెస్క్‌టాప్‌లు, డివైజ్‌లకే పరిమితం కాదు. ఏఐ ఆధారిత పరిజ్ఞానం జీవితంలోని అనేక విషయాల్లో అన్వయించుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో మరింత విస్తరించనుంది. ముఖ్యంగా మనం నివసించే గృహాలు కూడా స్మార్ట్ హోమ్‌లుగా, అంతకు మించి ఇంటెలిజెంట్ వ్యవస్థలుగా మారనున్నాయని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీని బట్టి చూస్తే ఇది సాధ్యం అవుతుంది కూడా. ఇంటి గోడలు, కిటికీలు,
భవిష్యత్ గృహాలు సాధారణ స్మార్ట్ హోమ్‌లకు మించి, ఇంటెలిజెంట్ సిస్టమ్‌లుగా మారుతున్నాయి, ఇక్కడ గోడలు, కిటికీలు, వివిధ ఉపకరణాలు, ఎనర్జీ నెట్‌వర్క్‌లు కలిసి పనిచేయగల సాంకేతికత గృహ నిర్మాణంలో అంతర్భాగం కావచ్చు. మానవుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను అందించవచ్చు. ఈ మార్పు సెన్సర్లు, డేటా అండ్ ఆన్-డివైస్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతుంది. ఇది గృహాల స్వయంప్రతిపత్తిలో, స్వీయ-నిర్వహణాత్మకంగా చేస్తుంది. ఉదాహరణకు, గోడలు రంగు మార్చుకోవడం లేదా సమాచారం డిస్‌ప్లే చేయడం, కిటికీలు, తలుపులు ఆటోమేటిగ్గా మూసుకోవడం, తెరచుకోవడం, అడ్జెస్ట్ చేయడం వంటివి ఒక్క బటన్ నొక్కగానే లేదా ఆదేశం ఇవ్వగానే ఏఐ ఆధారిత సాంకేతికతతో జరిగిపోతాయి. ఫ్లోర్‌లు స్వయంగా క్లీన్ అవుతాయి. ఫ్రిడ్జ్‌లు న్యూట్రిషన్ ట్రాక్ చేస్తాయి. షవర్‌లు హెల్త్ డేటాను లాగ్ చేస్తాయి. ఈ ఫీచర్లు AI అండ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఇంటిగ్రేషన్ ద్వారా గృహాలను మరింత సమర్థవంతంగా చేస్తాయి. ఎనర్జీ ఆప్టిమైజేషన్, పర్సనలైజేషన్‌ను పెంచుతాయి.
AI హోమ్ మేనేజర్లు స్మార్ట్ గృహాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లీనింగ్, రిపేర్లు, డెలివరీలు, ఎనర్జీ ట్రేడింగ్‌ను కో ఆర్డినేట్ చేస్తాయి. విజిటర్లను గుర్తించడం, లోకల్ AI మోడల్స్ రన్ చేయడం ద్వారా వేగవంతమైన, సురక్షితమైన ఆటోమేషన్ సాధ్యమవుతుంది. ఇవి హెల్త్ మానిటరింగ్ (ఉదా.. షవర్ ద్వారా హెల్త్ డేటా), టాస్క్ హ్యాండ్లింగ్, సేఫ్టీ ఎన్‌హాన్స్‌మెంట్ అండ్ పర్సనలైజేషన్‌ను మినిమల్ ఎఫర్ట్‌తో అందిస్తాయి. ఉదాహరణకు.. స్మార్ట్ లైటింగ్ అండ్ క్లైమేట్ కంట్రోల్ AI ద్వారా మానవ ప్రవర్తనకు అనుగుణంగా మారుతాయి. ఎనర్జీ వేస్ట్ తగ్గిస్తాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్‌తో ఇన్నోవేషన్‌లు సస్టైనబుల్ లివింగ్‌ను ప్రమోట్ చేస్తాయి. Link






