- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోగ్యానికి మంచిదని వేడినీళ్లు తాగుతున్నారా..? అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్న నిపుణులు
ఆరోగ్యానికి మంచిదని వేడినీళ్లు తాగుతున్నారా..? అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్న నిపుణులు

దిశ, ఫీచర్స్ : సీజనల్ ప్రభావాలను బట్టి వర్షాకాలంలోనో, చలికాలంలోనో కాచి చల్లార్చిన నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అది కూడా కేవలం గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ సమయం సందర్భం లేకుండా ఎల్లప్పుడూ వేడి నీరే తాగే అలవాటు మీకుందా? పైగా గోరు వెచ్చని నీరు కాకుండా, అంతకుమించి వేడిగా ఉన్న నీరు తాగుతున్నారా?.. నో డౌట్! మీకు అన్నవాహిక క్యాన్సర్ (Esophageal cancer) వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రీసెంట్‌గా జెంగ్ అనే 57 ఏండ్ల చైనీస్ మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు వేడి నీరు తాగాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
*ఏదో అనారోగ్యం చేసినప్పుడో, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనో తప్ప దాదాపు అందరూ చల్లటి నీరే తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ జెంగ్ అనే చైనీస్ మహిళకు మాత్రం రోజూ 6 నుంచి 7 కప్పుల వేడినీటిని తాగే అలవాటు ఉంది. అది కూడా కాచి చల్లార్చిన తర్వాత కాదు, గోరు వెచ్చని స్థాయికంటే ఇంకాస్త ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగడం ఆమెకు అలవాటు. ఇలా ఏదో కొన్నిరోజుల నుంచి ఆ అలవాటు ఉందనుకుంటే పొరపాటే.. రెండు దశాబ్దాల నుంచి ఆమె దీనిని కంటిన్యూ చేస్తూ వస్తోందట. కాగా ఇటీవల అమె కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లి రొటీన్ మెడికల్ టెస్టులు చేయించుకుంది. ఈ సందర్భంగా ఆమె అన్నవాహికలో అనుమానాస్పద గాయాలు గుర్తించిన జెంగ్‌జౌలోని ఆస్పత్రి వైద్యులు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది.
*వేడినీరు తాగే అలవాటు కారణంగా జెంగ్ అనే మహిళలో గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ పాలిప్స్ సమస్యలతోపాటు అన్నవాహిక క్యాన్సర్ డెవలప్ అయిందని నిర్ధారించారు. విషయం ఏంటంటే.. వేడి నీరు మాత్రమే కాదు, ఆహారం తిన్నా వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినేదట జెంగ్. ఈ అలవాట్లే చివరకు ఆమెను అన్నవాహిక క్యాన్సర్ (Esophageal cancer) బారిన పడేశాయి. కాబట్టి స్థాయికి మించి వేడి నీరు తాగడం, వేడి ఆహారం తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు.
డబ్ల్యుహెచ్‌ఓ ఏం చెబుతోంది?
తరచుగా సాధారణంకంటే ఎక్కువ వేడిగా ఉండే నీరు లేదా ఇతర పానీయాలు తాగడం అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) క్యాన్సర్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) కూడా ఇదే వెల్లడించాయి. 60 డిగ్రీల సెల్సియస్ పైన ఉన్న వేడి పానీయాలు క్యాన్సర్ కారకమని పేర్కొన్నాయి. అంతేకాదు దీర్ఘకాలంగా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక మ్యూకోసా(mucosa)కు థర్మల్ గాయం బారిన పడుతుంది. ఇది అన్నవాహిక స్క్వామస్ సెల్ కార్సినోమా (Squamous cell carcinoma) ప్రమాదాన్ని పెంచుతుంది. 2018లో ‘అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అధ్యయనం ప్రకారం కూడా 65 డిగ్రీల సెల్సియస్ పైన వేడిగా ఉండే టీ లేదా కాఫీ తాగే వారిలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే స్థాయికి మించి వేడి నీరు తాగడం, వేడి ఆహారాలు తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Link






